Thursday, May 9, 2024

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని సబ్‌ స్టేషన్‌ వద్ద ‘‘కాంగ్రెస్‌’’ ధర్నా

తప్పక చదవండి
  • ఎండిపోతున్న పొలాలను కాపాడాలి : బీఎల్‌ఆర్‌

మిర్యాలగూడ : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని బి అన్నారం విద్యుత్‌ సబ్స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటును పంట లకు ఇవ్వకపోవడంతో పంట పొలాలు పొట్ట దశకు వచ్చినవి ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద లాక్‌ షీట్ను పరిశీలించగా 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు నమోదయి ఉందని వాస్తవంగా పొలాలకు 3, 4 గంటల విద్యుత్‌ సరఫరా అనంతరం కరెంటు ఉండడం లేదని రైతుల పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ధర్నాకు హాజరైన మిర్యాలగూడ మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్‌ఆర్‌) మాట్లా డుతూ ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని, రైతులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రైతులు ఎంపీటీసీల ఫోరం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్‌ యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్దు నాయక్‌,పవన్‌ నాయక్‌ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు