Saturday, July 27, 2024

కాసరబాదలో విద్యార్థుల…‘‘ఆకలి గోస’’..

తప్పక చదవండి

– ఈ ఏడాది ప్రారంభం నుంచి మద్యాహ్న భోజనం బంద్‌
– స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
– జిల్లా కలెక్టర్‌ సారూ, విద్యార్థులకు భోజనం పెట్టించండి సారూ…

సూర్యాపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం పేదలే ఉండడంతో వారి శారీరక అభివృద్ధి కోసం ప్రభుత్వం మెనూ ప్రకారం మద్యాహ్న భోజనాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కానీ సూర్యాపేట మండలంలోని కాసరాబాద ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం మధ్యాహ్న భోజనం పథకం అమలు కావడం లేదు. ఒకరోజు, రెండు రోజులు కాదు ఈ ఏడాది పాఠశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం పెట్టిన దిక్కులేదు. ఆ పాఠశాలలో 1 నుంచి 8 తరగతులు ఉండగా 107 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు విద్యను చక్కగా బోధిస్తున్నారు. ఆ గ్రామంలో సమభావన సంఘాలు చాలా ఉన్నాయి. గతంలో పోటీపడి మధ్యాహ్న భోజనం వండేందుకు వచ్చి ఘర్షణలు పడ్డ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రానురాను అసలు ఎవరూ భోజనం వండకుండా పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో స్వీపర్‌ కూడా లేకపోవడంతో వంటకు సాధ్యపడటం లేదు. స్థానిక ప్రజా ప్రతి నిధులకు తెలిసినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఆ పాఠశాలలో కొందరు మాత్రం బాక్స్‌ లలో క్యారేజ్‌ తెచ్చుకొని భోజనం చేస్తుండగా మరికొందరు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తు న్నారు. ఇంకొందరు ఉపవాసం ఉన్న విద్యార్థుల కూడా లేకపోలేదు. పాఠశాలకు పేదవారే రావడంతో కొందరు పచ్చళ్ల తోనే భోజనం చేస్తుండడం విచారకరం. ప్రభుత్వం పాఠశాలలో మెనూ ప్రకారం మద్యాహ్న భోజనాన్ని పెట్టి విద్యా ర్థులకు శారీరక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధికి విద్యార్థుల శారీరక అభివృద్ధికి ఆటంకాలు నెలకొంటున్నాయి. భోజనం అమలు అవుతున్న పాఠశాలలో సోమవారం గుడ్డు, కూరగాయలు, రసం, మంగళవారం ఆకుకూర, పప్పు, రసం, బుధవారం గుడ్డు, కూరగాయలు, రసం, గురువారం సాంబారు, శుక్రవారం గుడ్డు, పీచు కూరగాయలు, రసం, శనివారం వెజ్‌ బిర్యానీ, ఆలుకూర్మ, రసం ఒక్కో విద్యార్థికి బియ్యం 150 గ్రాములు, కూరగాయలు 75 గ్రాములు, పప్పు 30 గ్రాములు, నూనె 10 గ్రాముల చొప్పున ప్రభుత్వం మద్యాహ్న భోజనానికి సరఫరా చేస్తుంది. ఈ మెనూ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేం దుకు తోడ్పడుతుంది. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడి యం భోదిస్తూ మద్యాహ్న భోజనం పెడుతుండడంతో విద్యా ర్థుల సంఖ్య పెరుగుతోందని భావిస్తున్న తరుణంలో ఈ కాసర బాద పాఠశాల విరుద్దంగా ఉండడంతో పలువురు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. స్వచ్ఛంద సంస్థలు సహాయంతో మద్యాహ్న భోజనాన్ని అందించాలని వారు కోరుతున్నారు.
అల్పాహారం అందేనా.? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాహ్న భోజ నంతో పాటు ఉదయం అల్పాహారం ప్రవేశపెట్టాలని ఈ నెల 24 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకం కూడా అందుతుందో లేదో అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఏది ఏమైనా అధికారులు స్పందించి విద్యార్థులకు మద్యా హ్న భోజనాన్ని పెట్టించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతు న్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు దుర్గారెడ్డిని వివరణ కోరగా గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, పై అధికారులకు కూడా విష యం తెలియజేయడం జరిగింది. ఏజెన్సీ వారు రాకపో వడంతో మద్యాహ్న భోజనాన్ని పెట్టలేకపోతున్నామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు