Saturday, April 27, 2024

‘‘ఆర్థికంగా’’ దివాలా తీసిన పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌…

తప్పక చదవండి
  • నియంత్రణ లేని అభివృద్ధి పనులు..
  • ‘‘మేయర్‌’’ బంధువులకే కోట్లాది పనులు..
  • ఈ ప్రొక్యూర్‌ మెంట్‌కు విరుద్ధంగా టెండర్లు..
  • కార్పొరేషన్‌ ప్రతి సెక్షన్‌లో మేయర్‌ బంధువులే కీలకం..
  • పీర్జాదిగూడలో ఒక వర్గం కాంట్రాక్టర్లదే ఆధిపత్యం..

హైదరాబాద్‌ : పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌. పేరుకే ఉత్తమ కార్పొరేషన్‌గా అవార్డులు అందుకుంటుందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆర్థికంగా దివాలా తీసింది. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలలోనే ఉత్తమ కార్పొరేషన్‌ గా అవార్డులు అందుకోవడంతోనే సఫలీకృతమైన ఆర్థికంగా పరుపుష్ట సాధించడంలో మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి విఫలమయ్యారు. పిర్జాదిగూడ కార్పొరేషన్‌ లో నియంత్రణ లేని అభివృద్ధి పనులు చేయడంతోనే ఆర్థిక దివాలకు కారణమైంది. గత మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి పనులలో నియంత్రణ లేక ఒక వర్గం కాంట్రాక్టర్లకే ఇంజనీరింగ్‌ అధికారులు దాసోహం అయిపోయి ఆర్థిక దివాలాలకు కారణమయ్యారు.

పిర్జాదిగూడ కార్పొరేషన్‌ లో ఈ ప్రొక్యూర్‌ మెంట్‌ కు విరుద్ధంగా మేయర్‌ కనుసనల్లోనే ఒక వర్గం కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల పనులు అప్పజెప్పడంలోనే అసలు బీజం పడిరదని. చేపట్టిన అభివృద్ధి పనులు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా పనులు పూర్తి చేసిన ఇంజనీరింగ్‌ అధికారులు బిల్లులు చెల్లించడంలోని కుట్ర కోణం దాగుంది.
పిర్జాదిగూడలో ఒక వర్గం కాంట్రాక్టర్లదే ఆధిపత్యం :
పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో మేయర్‌ కనుసన్న లోనే ఒక వర్గం కాంట్రాక్టర్లకు కోట్లాది నిధులు కేటాయిస్తున్నట్లు ఆరో పణలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ సెక్షన్‌ లో బంధుగణాన్ని ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టర్లు రాత్రికి రాత్రి ఎంబీలు రాయించుకొని బిల్లులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయ. అందుకు ఇంజనీరింగ్‌ అధికారులు అధిక శాతం పర్సంటేజ్‌లు తీసుకొని బిల్లులు మంజూరు చేయించుకున్నట్లు ఉన్నాయి.

- Advertisement -

ప్రతి సెక్షన్‌లో మేయర్‌ బంధువులే : పిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ప్రతి సెక్షన్‌ లోను మేయర్‌ బంధు గణమే ఆధిపత్యం చలాయిస్తున్నారు. ప్రతి సెక్షన్‌ లో మేయర్‌ బంధుగణం అధికారులను భయాందోళనకు గురి చేస్తూ తమ అనుకూలమైన వాళ్లకే పనులు చక్కబెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వీళ్ళతోనే లంచాలు తీసుకొని కార్పొరేషన్‌ దివాలా తీసేందుకు కారణమయ్యారని వాదనలు లేకపో లేదు.గతంలో శానిటేషన్‌ విభా గంలో అధికారిని ఇలాంటి ప్రలో భాలకే గురి కావడం తోనే అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఇప్ప టికైనా మున్సిపల్‌ శాఖ ఉన్నతా ధికారులు స్పందించి పీర్జా దిగూ డలో జరుగు తున్న అవినీతి, అక్రమా లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు