Tuesday, October 15, 2024
spot_img

తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసింది..

తప్పక చదవండి
  • తెలంగాణ వెనుకబడటానికి కారణం బీ.ఆర్.ఎస్.
  • సుష్మ స్వరాజ్ లేకపోతే తెలంగాణ లేదు..
  • రాష్ట్రంలోని వనరులను దోచుకుని ప్రైవేట్
    లిమిటెడ్ కంపెనీగా మార్చారు..
  • హుజూరాబాద్ ఎన్నికల ప్రచార సభలో
    కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్..

హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పదేళ్ళుగా తెలంగాణ ప్రజలు నీపై ప్రేమ చూపించారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా మార్చారు. దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆరే బాధ్యులు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసింది. సుష్మా స్వరాజ్ ఒత్తిడి మేరకే రాష్ట్ర ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మిమ్మల్ని మోసం, దగాచేసింది. వాజ్ పేయి మూడు రాష్ట్రాలను ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి సమ‌స్య రాలేదు. తెలంగాణ ఏర్పాటు చేసిన సమయంలో కాంగ్రెస్ అనేక సమస్యల్ని పరిష్కరించలేదు. పదేళ్ళుగా అధికారంలో ఉన్నా అభివృద్ధికి అవకాశం ఉన్నా అభివృద్ధి చేయలేదు. వనరులలను దోచుకుని రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. నిప్పు ఉన్నప్పుడే పొగవస్తుంది. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అందుకే ఢిల్లీ వరకు మీ అవినీతిపై చర్చ జరుగుతోంది. స్టేట్ ఫస్ట్ అనే అభిప్రాయం ఉన్నవారిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కానీ ఫ్యామిలీ ఫస్ట్ అనే వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉంది. కుటుంబం పాలనలో జోక్యం చేసుకుని పాలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎవరికైనా ఉద్యోగాలు లభించాయా. ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షా పత్రాలు లీకవుతున్నాయి.దళితులకు మూడెకరాల భూమి అందలేదు. దళిత బంధు ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ సరిగా చేయలేదు. వాజపేయి, మోదీలు దేశాన్ని పాలించారు. పాలిస్తున్నారూ. ఏ ఒక్కరూ బీజేపీ ప్రభుత్వంలో అవినీతి చేశారని వేలెత్తి చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రులు జైలుకు కూడా వెళ్లారు. అవినీతి ప్రసంగాలతో దూరం చేయలేం… సిస్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా మోదీ అవినీతి నిర్మూలనకు కృషి చేశారు. లబ్దిదారులకు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా వారి అకౌంట్ లోకి వెళ్తున్నాయి.” అని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. సభల్లో ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అనిపిస్తుంది. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ.. పౌరుషాల గడ్డ. కళలలను ప్రపంచానికి అందించిన గొప్ప గడ్డ ఇది. లక్ష్మీ నరసింహ స్వామి, భధ్రకాళి ఆలయం ఉన్న గడ్డ ఇది. ఎంతో మంది పోరాటాల యోదులను కన్న గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో తోడ్పాటు అందించింది. తెలంగాణ కోసం నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేర్చిన ఘనత కేసీఆర్ ది కాదు యువకులదే.. రాష్ట్ర ఏర్పాటు ఘనత వారికే దక్కుతుంది. 1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఒకటి గుజరాత్ లో అయితే రెండోది తెలంగాణ నుంచే గెలిచింది. అందుకే బీజేపీకి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆనాడు మీ ఆశీర్వాదంతో ఒక్క ఎంపీ సీటు గెలిపించి ఇచ్చిన ఉత్సాహంతోనే ఈనాడు మరి 302 సీట్లు గెలిచాం. దేశంలో 28 ఏళ్ళుగా రోల్ మోడల్ స్టేట్ గా గుజరాత్ ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది.” అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. “ప్రధాన మంత్రి అంటే వ్యక్తి కాదు ఒక ఇనిస్టిట్యూషన్. నేను ఏ ప్రధాన మంత్రిపై వ్యక్తి గతంగా ఆరోపణలు చేయను. రాజీవ్ గాంధీ హయాంలో వందరూపాయలు విడుదల చేస్తే 14 రూపాయలు మాత్రమే లబ్దిదారులకు చేరేవి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తుంది. కాని రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు. తెలంగాణలో 5 వేల కేంద్రాల్లో ఆయుష్మాన్ భారత్ సెంటర్ లు ప్రారంభం చేశారు. ప్రపంచంలో ఏ ప్రధాని చేయని సాహసాన్ని మోదీ చేసి చూపించారు. ప్రపంచ అగ్రదేశాల ప్రధానులు కూడా ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ ఇప్పించే సాహసం చేయలేదు. దేశంలో ప్రతి ఒక్కరికి రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. యుద్ధం సమయంలో సురక్షితంగా విద్యార్థులను, భారతీయులను దేశానికి తీసుకుని వచ్చారు. అభివృద్ధిపై మాకో లక్ష్యం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తరహాలో తెలంగాణను అభివృద్ధి చేస్తాం. నీతీఆయోగ్ సంస్థ రిపోర్ట్ ప్రకారం కోట్లాది మందిని పేదరం నుంచి బయటకు వచ్చారని చెప్పింది. 33శాతం మహిళా బిల్లు ఆమోదం చెందించడం ద్వారా చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగిపోతోంది. కులమతాలతో రాజకీయాలు చేయకండి.. కులరహితంగా అభివృద్ధి సాధించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటుంది. గతంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై ఏది చెప్పినా ప్రపంచం సీరియస్ గా తీసుకునేవి కావు. కానీ ఇప్పుడు భారత్ ఏం చెబుతుందో అని ఎదురు చూస్తున్నాయి. రూపాయి రూపాయి పేదల అభ్యున్నతి కోసం ఉపయోగపడాలి. పూల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘనత మన సైనికులది. ఉగ్రవాదాన్ని సమర్థించడం సరికాదు.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలి. చేయి గుర్తు మిమ్మల్ని ఎప్పుడో వదిలి వెళ్లింది. బీఆర్ఎస్ కారు బేకారు అయిపోయింది. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీని గెలిపించండి. లక్ష్మీదేవి కారులో కూర్చుని, చేయి పట్టుకొని ఇంట్లోకి రాదు. కమలం పువ్వు మీద కూర్చుని ఇంట్లోకి వస్తుంది. కమలం గుర్తుపై ఓటేసి లక్ష్మీ దేవిని ఇంటిలోకి ఆహ్వానించాలని కోరుతున్నా.” అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు