Sunday, May 12, 2024

చందమామ దక్షిణ రారాజులం మనమే..

తప్పక చదవండి
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా హ్యాట్సాఫ్
  • 140 కోట్ల మంది ప్రజలు సంబురాలు చేసుకునే సమయమిది
  • మోదీ నాయకత్వంలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాలు
  • మోదీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక) విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉంది. చంద్రమండలంలోని దక్షిణ భాగంపై ల్యాండైన తొలి స్పేస్ క్రాఫ్ట్ మనదే కావడం మనదే. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ ప్రయోగించి విఫలమయ్యాయి. ఇటీవల రష్యా ప్రయోగించిన ఉపగ్రహం కూడా దక్షిణ ద్రువానికి చేరుకోలేక విఫలమైన సంగతి మీ అందరికీ తెలుసు. దీనినిబట్టి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కావడం ఎంతటి కష్టమే అర్ధమయ్యే ఉంటుంది. అట్లాంటిది అత్యంత క్లిష్టమైన దశను కూడా విజయవంతంగా దాటి చందమామ దక్షిణ ధ్రువ రారాజుగా భారత్ అవతరించడం మహా అద్భుతం. అనిర్వచనీయం. మాటల్లో చెప్పలేని ఆనందమిది. యావత్ భారతదేశం గర్వించాల్సిన క్షణాలివి. ఇంతటి గొప్ప అద్భుత విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు బీజేపీ పక్షాన మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.

జులై 14 మద్యాహ్నం 2:35 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగికెగిసిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణించింది. దాదాపు 3 లక్షల 84 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అంతరిక్ష నౌక ఈరోజు చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా సురక్షితంగా ల్యాండ్ ఆవడం సంతోషంగా ఉంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, చంద్రయాన్-3ని మరింత సమర్థంగా తీర్చిదిద్ది భారత్ సత్తా చాటిన శాస్త్రవేతల కృషి ఎనలేనిది. రష్యా దాదాపు 2 వేల కోట్లు ఖర్చు చేసి స్పేస్‌క్రాఫ్ట్ ను ప్రయోగించినా విఫలమైతే… భారత్ మాత్రం కేవలం 600 కోట్లతోనే చంద్రయాన్ 3ను రూపొందించి సక్సెస్ చేయడం మనందరం గమనించాలి. ఇప్పటి వరకు భూమి మీది నుండే చూస్తున్నామే తప్ప చందమామ గురించి మనకేమీ తెల్వదు. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మలు చెప్పే కథల్లోనే వింటూ వచ్చాం. ఇకపై చందమామ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఇక్కడి భూకంపాల మాదిరిగా అక్కడ చంద్రకంపాలేమైనా ఏర్పడతాయా? మనుషుల నివాస యోగ్యమైన ప్రాంతమేనా? అక్కడున్న ఖనిజాలేమిటి? అనే అంశాలపై స్పష్టత రానుంది. చంద్ర మండలంలో 1 రోజు అంటే భూమండలంలో మనకు 28 రోజులతో సమానం. అంటే అక్కడ 1 పగలు మనకు 14 రోజులతో సమానం. మనం పురాణాలు చదివేటప్పుడు భూమి మీద నివసించే మానవులకు… పురాణాల్లో ఉన్న వారికి జీవిత కాలంలో చాలా తేడా ఉండేదని వినేవాళ్లం. చందమామపై పరిశోధనల ద్వారా ఇప్పుడు స్వయంగా తెలుసుకోగలుగుతున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్ తో భవిష్యత్తులో చంద్ర మండలంలో ప్రయాణించడంతోపాటు మన భావితరాల ప్రజలు అక్కడే నివాసం ఉండే రోజులు కూడా రాబోతున్నాయి.
ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇస్రోకు మరోసారి నా హ్యాట్సాఫ్… ఆర్దిక ప్రగతిలో 10వ స్థానంలో భారత్ ను 5వ స్థానికి చేర్చిన మోదీ గారు.. చంద్రుడి దక్షిణ భాగంలో అడుగు పెట్టడం ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విషయాన్ని మోదీ నాయకత్వంలో ఇస్రో సుసాధ్యం చేయడం మర్చిపోలేని అంశం. ఇస్రోకు ఆర్దికంగా, ఇతరత్రా సంపూర్ణ, సహాయ సహకారాలందిస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్న మోదీగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మోదీగారి నాయకత్వంలో భారత్ చిరస్మరణీయమైన విజయాలను అందుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రపంచానికి తలమానికం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నా.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు