Wednesday, May 15, 2024

రాజకీయ పార్టీలతో సీఈఓ సమీక్షా సమావేశం

తప్పక చదవండి
  • పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
  • భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచన
  • లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక
  • రిటర్నింగ్‌ అధికారులపై రాజకీయ పార్టీల ఫిర్యాదు
  • నిబంధనలు పార్టీలే కాదు.. అధికారులు పాటించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలతో సీఈఓ వికాస్‌ రాజ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ఘట్టం పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు సీఈఓ.భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, ఈ భేటీలో రిటర్నింగ్‌ అధికారులపై మూకుమ్మడిగా కంప్లయింట్‌ చేశాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈసిఐ నిబంధనలు పార్టీలే కాదు.. అధికారులు పాటించాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది ఎలక్షన్‌ కమిషన్‌. సీఈఓ వికాస్‌ రాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలింగ్‌, కౌంటింగ్‌ అంశాలకు సంబంధించిన కీలక సూచనలు చేశారు సీఈఓ వికాస్‌ రాజ్‌. ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన నిబందనలను వివరించారు. నామినేషన్ల స్క్రూట్నీ, ఉపసంహణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు సంబంధించిన వివరాలు వెల్లడిరచారు అధికారులు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం ఎన్నికల సంఘానికి నలుగురికి మించకుండా స్టార్‌ క్యాంపెనర్స్‌ లిస్ట్‌ ఇవ్వాలని ఆయా పార్టీలను కోరింది ఈసీ. అదే విధంగా మేనిఫెస్టో వివరాలను మూడు రోజుల్లోనే సీఈఓ కార్యాలయానికి అందించాలని కోరింది. ఇక ఎన్నికల ప్రచారానికి కావాల్సిన అనుమతులు సువిదా పోర్టల్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచింది ఈసీ. అయితే షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 11వేల అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు అధికారులు. ఇక ఈపిఐసి కార్డుల పంపిణీ ఇప్పటికే 33లక్షలు పంపిణీ చేశారని, మరో 8లక్షల కార్డులను పంపిణీ చేస్తామని వికాస్‌ రాజ్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఓటర్‌ స్లీప్‌ పంపిణి 10వ తేదీ నుంచి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసీఐ స్పెషల్‌ కంప్లయింట్‌ బాక్స్‌ అయిన సివిజిల్‌ యాప్‌ ద్వారా 3వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో ఇప్పటికే 2వేల వరకు వివరణ, యాక్షన్‌ తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.ఇక సీఈఓ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అయ్యాక బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు రిటర్నింగ్‌ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఈఓ కు ఫిర్యాధు చేశాయి. నామినేషన్‌ ప్రక్రియలో ఆర్‌ఓ అధికారులు ఈసీఐ నిబంధనలు పాటించడం లేదని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సభల్లో రేవంత్‌ రెడ్డి మాట్లాడే భాషపై బీఆర్‌ఎస్‌ కంప్లయింట్‌ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధులు ధ్వజమెత్తారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఫిర్యాదులపై ఈసీ స్పందించకపోతే ఈసీఐకి ఫిర్యాధు చేస్తామని తెలిపారు. నోటిఫకేషన్‌ వచ్చాక మొదటిసారి పొలిటికల్‌ పార్టీలతో రివ్యూ పెట్టిన ఈసీ కీలక సూచనలు ఆదేశాలు జారీ చేసింది. ఈసీఐ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా పోలింగ్‌ కౌంటింగ్‌ ప్రక్రియలో అధికారులకు సహకారం అందించాలని సీఈఓ కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు