Monday, April 29, 2024

ఓక్రిడ్జ్‌ గచ్చిబౌలిలో ఉత్సాహంగా ముగిసిన కాస్నివాల్‌ 2024

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఓక్రిడ్జ్‌ ఇంట ర్నేషనల్‌ స్కూల్‌, గచ్చిబౌలి కాస్నివాల్‌ 7వ ఎడిషన్‌ను విజయవం తంగా ముగించుకుంటూ కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికింది. ఇది స్టూడెంట్‌ యాక్టివిటీలో క్రియేటివ్‌, యాక్షన్‌, సర్వీస్‌ (సీఏఎస్‌)ని ప్రతిబింబించే కార్యక్రమం. ఈ ఈవెంట్‌కు హాజరైన 2500 పైచిలుకు మందిని ఎంతగానో ఆకర్షించింది. విద్యార్థులలో సృజనాత్మకత, ప్రతిభ, వ్యవస్థాపకత ను పెంపొందించడంలో ఓక్రిడ్జ్‌ గచ్చిబౌలి చూపిస్తున్న నిబద్ధతకు ఇది ఒక అద్భుతమైన అధ్యాయంగా మారింది. ఈ కార్యక్రమా నికి ప్రముఖ నటి, వ్యాఖ్యాత, నిర్మాత సుమ కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ నటులు రోషన్‌ కనకాల, మానస చౌదరి కూడా హాజరయ్యారు. విద్య, సామాజిక ప్రభావం యొక్క విశిష్ట సమ్మేళనం అయిన కాస్నివాల్‌ విద్యార్థులు తమ సొంత స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి, యువ పారిశ్రామిక వేత్తలుగా మారడానికి, విభిన్న ప్రేక్షకులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించ డానికి ఒక వేదికగా ఉపయోగపడిరది. అలాగే, ఈ ఈవెంట్‌ విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవా కారణాల కోసం విరాళాల ను సేకరించే ఒక దాతృత్వ మలుపు కూడా తీసుకుంది. సామా జిక బాధ్యత పట్ల ఓక్రిడ్జ్‌ అంకితభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమంలో రోషన్‌ కనకాల మాట్లాడుతూ ‘పాఠశాలకు ఇబ్బంది కలిగించే వ్యక్తి నుంచి కాస్నివాల్‌ 2024కి నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం చూస్తే జీవితం కళ్ల ముందు తిరిగినట్టు అనిపిస్తోంది. దీన్ని నేను ఓ గౌరవంగా భావిస్తున్నా. ఈ ఈవెంట్‌ కు నా మానసులో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ యువ మన స్సుల సృజనాత్మకత, ఉత్సాహాం నిజంగా స్ఫూర్తిదా యకం’ అని అన్నారు. సుమ కనకాల మాట్లాడుతూ ‘ఈ రోజు ఇక్కడ నా కుమారుడితో కలిసి కాస్నివాల్‌ కు హాజరవడం చాలా గర్వంగా ఉంది. మంచి రేపటి కోసం పని చేస్తున్న పిల్లలందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఈచొరవ కొనసాగుతుందని, మన మంతా ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరుస్తామని ఆశిస్తున్నా’ అని అభిప్రాయపడ్డారు. ఓక్రిడ్జ్‌కు చెందిన అంకిత భావంతో కూడిన విద్యార్థి వాలంటీర్ల బృందం నిర్వహించిన కార్నివాల్‌ సృజ నాత్మకత, ప్రతిభ, వ్యవస్థాపకత సమ్మేళనాన్ని ప్రదర్శించి ంది. ఈవెంట్‌కు హాజరైన వారందరికీ మరపురాని అనుభూతిని అంది ంచింది. 2016లో ప్రారంభమైనప్పటి ఈ కాస్నివాల్‌ ఈవెంట్‌ ఓక్రిడ్జ్‌ గచ్చిబౌలి ప్రధాన ఈవెంట్‌లలో ఒకటిగా మారింది. భవిష్యత్‌ వ్యాపారవేత్తలు, మెరుగైన ప్రపం చాన్ని రూపొందిం చడానికి అంకితమైన వ్యవస్థాపకుల అభివృద్ధిని ఇది ప్రోత్సహి స్తోంది. ఈ కార్యక్రమం పట్ల ప్రిన్సిపాల్‌ దీపికా రావు తన ఉత్సా హాన్ని వ్యక్తం చేశారు. ‘కాస్నివాల్‌ అనేది సమాజానికి మద్దతుగా నిలిచే విద్యార్థి కార్యక్రమాల వార్షిక ప్రదర్శన. ఓక్రిడ్జ్‌ గచ్చిబౌలి తన విద్యార్థులలో నింపే సృజనాత్మ కత, ఆవిష్కరణ, వ్యవస్థాపక స్ఫూర్తికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనం. ఈ కార్ని వాల్‌ను నిర్వహించడంలో మా విద్యార్థులు, యువ పారిశ్రామిక వేత్తలు చూపిన కృషి, అంకితభావాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని అన్నారు. ఈ ఏడాది కాస్నివాల్‌ అనాథల (ఎస్‌డీజీ 3) వైద్య ఖర్చులు, ప్రభుత్వ పాఠశాల కార్యక్ర మాలు (ఎస్‌డీజీ 4), క్లైమేట్‌ యాక్షన్‌ (ఎస్‌డీజీ 13) ఖర్చులకు సాయం ఇచ్చింది. ద్రువాంన్ష్‌, సారా, ఒడంబడిక హోమ్‌, ఎక్స్‌ట్రా మైల్‌, సాహి వంటి ఎన్జీవోలకు విరాళం అందించింది. తద్వారా సమాజంపై సానుకూల ప్రభావం చూపడంలో తమ నిబద్ధతను ఓక్రిడ్జ్‌ నొక్కి చెప్పింది. కాస్నివాల్‌ 2024కి నోర్డ్‌ ఆంగ్లియా ఎడ్యుకేషన్‌ ఎండీ క్రిస్టోఫర్‌ షార్ట్‌, డాక్టర్‌ చిన్నబాబుతో పాటు డాక్టర్‌ ప్రమీల కూడా హాజరవడం ఈ ఈవెంట్‌ గొప్పతనాన్ని మరింత పెంచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు