Monday, April 29, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే

తప్పక చదవండి
  • ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతిని ప్రజలు ఒప్పుకోరు
  • మీడియా సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు

హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందంటూ వ్యాఖ్యానించడం సరికాదని, ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఓడిపోతుందన్నప్పుడు బూతులు మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటేనని, హరీష్ రావు, ఆయన మామ పుట్టుక ముందు నుంచే హైదరాబాద్ నగరం ఉందని చురకలంటించారు. నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ ఉందన్నారు. అనేక సాంస్కృతిక , సాంప్రదాయాలకు హైదరాబాద్ కేంద్రమని, దీనిపై చర్చకు బీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు.

అంతేకాకుండా.. ‘పొలిటికల్ ప్రాముఖ్యత కలిగిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం నిజాం కంటే ముందు కూడా ఉంది. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారాలకు, కళలకు మారుపేరు హైదరాబాద్. హైదరాబాద్ పై చర్చకు హరీష్ సిద్ధంగా ఉన్నారా ? బీఆర్ఎస్ పుట్టకకు హైదరాబాద్ కు సంబంధం లేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు కష్టపడితే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముంబై కన్నా తెలుగు సినిమా నిర్మాణం వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది.. దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఎంటి ? వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారడంలో బీఆర్ఎస్ పాత్ర ఎంటి ? ఐటీ ఉత్పత్తుల్లో బీఆర్ఎస్ పాత్ర ఎంటి ? హైదరాబాద్ లో బీఆర్ఎస్ మాఫియా సామ్రాజ్యం పోతే ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో దేవాలయాల భూములు కబ్జాలు చేశారు.

- Advertisement -

రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్.. భవిష్యత్ లో పార్టనర్స్ వ్యవసాయ మోటార్ల సంఖ్య గతంలో 18 లక్షలు కాగా.. ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. సాగునీరు పెరిగితే బోర్లు.. వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగింది ? బీఆర్ఎస్, కాంగ్రెస్ కరెంట్ పై అనవసర చర్చతో అసలు విషయాలపై చర్చ రాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద ఘటనను ఖండించింది. ప్రధాని మోడీ. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. హమాస్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే భారత దేశంలో స్థానంలో లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హమాస్ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, హింసకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతుగా ర్యాలీలు ఉండవు హమాస్ ను ఖండిస్తూ.. కేసీఆర్ ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అన్నీ అంశాలతో చార్జిషీట్ విడుదల చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే.” అని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు