Tuesday, October 15, 2024
spot_img

అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి

తప్పక చదవండి
  • తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు
  • దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల హావిూలు ఏమయ్యాయి
  • పదేళ్లపాటు తెలంగాణను అప్పులకుప్ప చేశారు
  • అధికారంలోకి రాగానే రెండు హావిూల అమలు
  • ఫ్రీ బస్సుతో మహిళల్లో ఆనందం
  • కాళేశ్వరంపై న్యాయవిచారణకు ఆదేశించాం
  • బీఆర్‌ఎస్‌ నేతలే డబుల్‌ 420లు
  • మీడియా సమావేశంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క

హైదరాబాద్‌ : అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిందలు వేసే పనిలో పడ్డారని మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్కలు మండిపడ్డారు. ప్రజల తీర్పును గౌరవించలేని సంస్కారం వారిదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ 420 అంటూ విడుదల చేసిన బుక్‌ట్‌పై శ్రీధర్‌ బాబు మండిపడ్డారు. గతంలో ఇచ్చిన అనేక హావిూలను అమలు చేయలేని బిఆర్‌ఎస్‌ నేతలే డబుల్‌ 420ల ని ఎదురుదాడి చేశారు. దళితముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, డబ్లు ఇళ్లు వంటివన్నీ వారి వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు. తాము అధికారంలోకి రాగానే మహిళలరు ఉచితబస్సు సౌకర్యం కల్పించామని, ఆరోగ్యశ్రీ పథకంలో పదిలక్షలకు పెంచామని అన్నారు. కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీదర్‌ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే రెండు వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు. ప్రజా రవాణా మెరుగుపరిచామని తెలిపారు ఇప్పటి వరకు 6.5 కోట్ల జీరో టికెట్స్‌ ఇచ్చామని చెప్పారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు. కాంగ్రెస్‌ పై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాలేదని అప్పుడే తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమ మ్యానిఫెస్టో పై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించే పనిలో ఉన్నామని తెలిపారు. నియంతృత్వ ధోరణిలో బీఆర్‌ఎస్‌ నేతలుఉన్నారని అన్నారు. ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే విలువైన సలహాలు ఇవ్వండని సూచించారు. బీఆర్‌ఎస్‌ రిలీజ్‌ చేసిన బుక్‌ ను ఖండిస్తున్నామని శ్రీధర్‌ బాబు అన్నారు. రాష్టాన్న్రి 3 వేల 500 రోజులు బీఆర్‌ఎస్‌ పార్టీ పాలించిందని, ఆరున్నర లక్షలకోట్ల అప్పులు పెట్టిందన్నారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశించామని అన్నారు.దళిత ముఖ్యమంత్రి, ఉచిత నిర్భంద విద్య, డబుల్‌ బెడ్‌ రూం, కేజీ టూ పీజీ, విభజన చట్టం హావిూలు ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో అవన్ని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణను రూ. 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని శ్రీధర్‌ బాబు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతవుతుందని ఆ విషయం వారికి కూడా తెలుసని అన్నారు. బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటి చేసేందుకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. ఇది గమనించి భయం పట్టుకుందని, గందరగోళంలో పడి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ను ప్రజలు చత్తబుట్టలో వేశారని శ్రీధర్‌ బాబు అన్నారు. బీఆర్‌ఎస్‌ తన పరువు తానే తీసుకుందని ప్రజలిచ్చిన ప్రతిపక్ష పాత్రకు బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయం చేకూర్చడం లేదని వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కొంత మంది ఆటో సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అన్ని ఆలోచనలు చేసే తమ మ్యానిఫేస్టోను రూపొందించామని శ్రీధర్‌ బాబు అన్నారు. మహిళలకు ఉచితబస్సును జీరిª`ణించుకోవడం లేదని..వారు దీనిని వద్దంటున్నారా చెప్పాలన్నారు. ’మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి బీఆర్‌ఎస్‌ నేతలు భయపడి మాపై దుష్పచ్రారం చేస్తున్నారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్యూడల్‌ పార్టీ అని.. అధికారం లేకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అన్నారని ఏమైందని ప్రశ్నించారు. పదేళ్లు రాష్టాన్న్రి దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆర్‌ఎస్‌ పార్టీ 420 అనే ప్రజలు ఓడగొట్టారన్నారు. ప్రజాస్వామికంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తాం అంటున్నారని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో వాళ్లని బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొట్టి వాళ్లతో నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ఆలోచన రాగానే ఆటో డ్రైవర్లతో మొదటగా మాట్లాడిన తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌నే 420 పార్టీ అని.. ఆ పార్టీ దొచుకున్న దంతా బయటకి వస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ బారెడు. ఖర్చు చారెడు అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం ఎక్కడిదని.. ఎవడు కష్టపడ్డారని నిలదీశారు. తెలంగాణ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ కాదు. భ్రమల తెలంగాణ చేశారన్నారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్టాన్న్రి దోచుకుంది బీఆర్‌ఎస్‌ నాయకులు. భారం మోయాల్సింది తెలంగాణ ప్రజలా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అప్పు చేస్తే తెలంగాణ ఎందుకు సిగ్గు పడాలని మంత్రి సీతక్క నిలదీశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు