Sunday, July 21, 2024

అలుపెరుగని పోరాటం.. పరిష్కారంకోసం ఆరాటం..

తప్పక చదవండి

( విజయాలనే ఆభరణాలుగా చేసుకున్న తెలంగాణ బిజెపి,
మహిళా మోర్చా, రాష్ట్ర అధికార ప్రతినిది యమునా పాఠక్.. )

  • పోరాటంతో మొదలైన ఆమె జీవన ప్రయాణం పలు విజయతీరాలు చేరింది..
  • ఏపదవీ లేకున్నా ప్రజా సంక్షేమమే ఆమె పరమావధి..
  • మల్కాజ్గిరి నియోజకవర్గంలో అశేష అభిమాన గణం ఆమెకు సొంతం..
  • గెలుపును సునాయాసంగా అందుకోగల సత్తా ఉన్న ఆమెను పరిగణలోకి
    తీసుకోవాలంటున్న రాజకీయ విశ్లేషకులు..
  • బీజీపీ అధిష్టానం ఆలోచించుకుని తగిన న్యాయం చేయాలని
    కోరుతున్న మల్కాజ్గిరి ప్రజానీకం..

కొందరు కారణం జన్ములుగా పుడతారు.. సేవే పరమార్ధంగా భావిస్తూ జీవిస్తుంటారు.. తమ ఆలోచనలలో అణువణువులో సమాజ శ్రేయస్సును నింపుకుని ముందుకు సాగిపోతుంటారు.. ఆ కోవలోకే వస్తారు యమునా పాఠక్.. సమస్యల పరిష్కారం కోసమే ఈ మహిళామణి ఈ భూమ్మీద జన్మించిందా అనిపిస్తుంది.. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావిస్తూ హితోధికంగా తనకు చేతనైనంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.. ఆమె స్పృజించని కోణం లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రస్తుతం యమునా పాఠక్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. పదవికి అతీతంగా ఆమె చేస్తున్న పోరాటం చిరస్మరణీయం.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తక్షణమే ప్రత్యక్షం అవుతారు.. ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు అలుపెరుగని పోరాటం చేస్తారు.. న్యాయం సిద్దించేవరకు.. నిద్రాహారాలు మాని చిత్తశుద్ధితో కృషి చేస్తారు.. సేవ అనే పదానికి నిలువెత్తు నిదర్శణంగా నిలుస్తున్న మహిళా మూర్తి, నాయకురాలు యమునా పాఠక్ గురించి ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం..

- Advertisement -

హైదరాబాద్ : యమునా పాఠక్ ఈ పేరువింటేనే సమస్యలు చిన్నబోతాయి.. ఆమె ఆత్మవిశ్వాసం ముందు తలొంచుతాయి.. ఆమె జీవన నేపథ్యం స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించడం.. చిన్ననాటినుండే సేవా తత్పరత అలవరచుకోవడం.. సమస్యలపై గళమెత్తి పోరాటం చేయడం.. బడుగు బలహీణ వర్గాలకు ఆశాజ్యోతిగా తన జీవన క్రమాన్ని మార్చుకోవడం.. ప్రజా పక్షపాతిగా, పోరాటాన్ని ఆభరణంగా మార్చుకున్న ధీశాలి.. పదవికే అలంకారంగా మారడం ఆమెకే సాధ్యం.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నిలబడి ప్రజా ప్రతినిధిగా ఎన్నికై మరింతగా ప్రజా క్షేత్రంలో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసుకోవాలనే దృఢ నిశ్చయంతో సాగిపోతున్న ఆమె ఆకాంక్ష నెరవేరాలని ఆదాబ్ కోరుకుంటోంది.. యమునా పాఠక్ సేవా చరిత్రలోని ముచ్చుకకు కొన్ని ఆంకాలను మీముందుకు తీసుకునివచ్చె ప్రయత్నం చేస్తున్నాం..

9 నెలల ఆడబిడ్డ మీద జరిగిన లైంగిక అత్యాచారం చూసి కంటతడి పెట్టిన ఆమె హృదయం ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆ దురదృష్టకర సంఘటనను ఖండిస్తూ.. 48 గంటల సంపూర్ణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.. దుర్మార్గుడైన ఆ నిందితుడికి శిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేయడం చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నపిల్లల మీద లైంగిక దాడి, వ్యభిచారం లాంటి అమానుష అంశాల మీద ఉక్కు పాదం మోపుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శణ చేయడం ఆమె ధైర్యానికి ప్రతీక.. 30 ఏళ్లగా మంచినీటి సమస్యతో బాధపడుతున్న మల్కాజ్గిరి, ఇందిరా నెహ్రూ నగర్ బస్తీ ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటింటికి నల్లా కనెక్షన్లు
మంజూరు చేయించడం జరిగింది.. దాదాపు 20 సంవత్సరాలు పైగా కనీస టాయిలెట్స్ లేని భూదేవి నగర్ బస్తి, అల్వాల్ ప్రజలకు స్వచ్ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ ఏర్పాటుకు విశేష కృషి సల్పారు.. ఆర్కే పురం లేక్, సఫిల్ గూడా లేక్, యాప్రాల్ లేక్ పై సమిష్టి ప్రాతినిత్యాన్ని ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. నెరేడ్ మెట్ లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నిరాహార దీక్షలు చేపట్టిన దీక్షా పరురాలు యమునా పాఠక్.. 20,000 మంది ఆడపిల్లలు, మహిళల సంరక్షణకై సాహసి కార్యక్రమం ద్వారా ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమానికి నాంది పలికారు.. ఇక సఫలం కార్యక్రమం ద్వారా ఎంతో మంది వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించారు.. డ్రగ్స్ మహమ్మారిపై అనేక అవగాహన కార్యక్రమాలు, భారీ ఎత్తున యువతతో, మహిళలతో ర్యాలీలు నిర్వహించారు.. అభయయజ్ఞం పేరిట సామాజిక దృక్పథంతో ఉన్న పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా మంచినీటి సరఫరా చేయించడం జరిగింది.. మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకు ప్రత్యేకంగా ఉపాధికి పెద్దపీట వేస్తూ.. కొన్ని వేల మందికి ఉచిత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కోర్సెస్ ను, వారధి అనే కార్యక్రమం ద్వారా నిర్వహించారు.. దాదాపు 1700 పైన టెలివిజన్ మాధ్యమం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ.. ఎన్నో సామాజిక అంశాల మీద చర్చా వేదికల్లో పాల్గొనడం జరిగింది..
జాగోరే అనే సామాజిక టీవీ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తీరే దిశలో అడుగులు వేయడం ఆమెలోని మరోకోణంగా చెప్పుకోవచ్చు.. 297 మంది ఆడపిల్లలకు విద్యాభ్యాసం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికలకు కన్యాదానం లాంటి బృహత్తర కార్యక్రమం.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు ఉచిత డే కేర్ సెంటర్ నిర్వహణ.. ప్రపంచవ్యాప్తంగా అటు లోకల్ టు గ్లోబల్ ఎంతో మంది యువతకు మోటివేషనల్ వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించడం జరిగింది.. మహిళల కొరకు ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది.. కాలనీల మధ్య డంపింగ్ యార్డ్ సమస్యపై సమిష్టి నివేదికను తయారు చేసి సంబంధిత ఉన్నతాధికారులకు ఇవ్వడం కూడా జరిగింది..

యమునా పాఠక్ నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఇవి మచ్చుకకు మాత్రమే.. ఇలాంటి మహిళా నాయకురాలు, గెలుపును సునాయాసంగా అందుకోగలిగే నాయకురాలిపై దృష్టిపెట్టాలని బీజేపీ అధినాయకత్వాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు