Saturday, April 27, 2024

దళితుల స్మశానవాటిక యథేచ్ఛగా కబ్జా..

తప్పక చదవండి
  • కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
  • ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించిన బ్యాగరి సంఘం
    రాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్ రావు..
  • అధికారులు, వివిధ పార్టీల నాయకులు కబ్జా స్థలాన్ని
    పరిశీలించాలని కోరిన వైనం..
  • బాబీ బాయ్,తుకారాం లే పాత్ర సూత్ర దారులా..?
  • చివరకు స్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలని వైనం..

కాదేదీ కవితకు అనర్హం అన్న మహాకవి శ్రీ శ్రీ చెప్పిన భాష్యానికి వక్రభాష్యం పలుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో నిస్సిగ్గుగా రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు.. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ స్థలాలు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఒక్కటేమిటి, అన్నిటినీ వదలకుండా కబ్జా చేస్తున్నారు.. సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే.. చివరికి వీరి కోరల్లో స్మశాన వాటికలు కూడా చిక్కుకుని కనుమరుగై పోతున్నాయి.. ఇంతకంటే దయనీయ ష్టితి ఇంకేమి ఉంటుంది..? అసలు కబ్జాదారులు ఎవరి అండచూసుకుని ఈ విధంగా రెచ్చిపోతున్నారు..? అధికార పార్టీ అండతో.. అవినీతి అధికారుల సహకారంతో ఇదంతా జరుగుతోందన్నది పచ్చి నిజం.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులను చక్కదిద్దేదెవరు అన్నది ప్రశ్నార్థకంగా మారింది..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం, గండిపేట్ మండలం, ఖానాపూర్ గ్రామంలో దళితుల స్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్ఫూర్తి భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాగరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్ రావు మాట్లాడుతూ.. స్మశాన వాటికను ద్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. ఖానాపూర్ గ్రామస్తులు వారికీ తెలియజేసినట్లు తెలిపారు . మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో.. స్మశాన వాటిక స్థలంలోకి వెళ్లి చూడగా స్మశాన వాటికలో నిర్మాణమైన పనులను ధ్వంసం చేసిన దృశ్యాలు కనపడ్డాయని అన్నారు..స్థానిక గ్రామస్తులు స్మశాన వాటికకు కాపలా కాస్తున్నారని, ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి గుండాలను వందల సంఖ్యలో పెట్టారని అన్నారు .. కబ్జాకు గురైన స్థలంలో నిర్మాణ పనులు చేస్తున్నట్టు వారి దృష్టికి వచ్చిందని.. కబ్జా పాల్పడుతున్న బాబీ బాయ్, తుకారాంల ప్రోద్భలంతోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు .కబ్జాకు గురైతున్న స్మశాన వాటిక స్థలాన్ని కలెక్టర్, ఆర్.డి.ఓ., ఎమ్మార్వోలు స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి, కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ..చివరకు స్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలకుండా కబ్జా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా కబ్జాలు చేయడం చూస్తుంటే చివరకు స్మశాన వాటికల పై కబ్జారాయుళ్లు కన్నేయడంతో దహన సంస్కారాలు చేసే స్థలం కూడా ఉండకుండా పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జారాయుళ్లపై పీడి యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ కేసులతో పాటు , అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాగరి సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు.. కబ్జాకు గురైన స్మశానవాటిక స్థలాన్ని పరిశీంచడానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.. అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా స్మశాన వాటిక స్థలాలపై పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి,వాటిని పరి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని గుర్తు చేశారు .. ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన నేషనల్ ప్రెసిడెంట్ బల్వంత్ రావు, బ్యాగరి సంఘం సత్యం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు