Sunday, May 19, 2024

సికింద్రాబాద్ లో ఓటమి దిశగా బీజేపీ..

తప్పక చదవండి
  • అభ్యర్థి తీరుతో పార్టీకి దూరంగా సీనియర్ నాయకులు..

సికింద్రాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరంగా ఓటమి కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ కి కొంత ఓటు బ్యాంకు పెరిగినప్పటికి అభ్యర్థి వల్ల ప్రస్తుత పరిస్థితి గోరంగా ఉందని సొంత పార్టీ నాయకులే స్వయంగా చెప్పుకుంటున్నారు. ఎంత కష్టపడ్డా కూడా నియోజకవర్గంలో ఓటమి తప్పదని పార్టీ నాయకులే భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతుండగా బీజేపీ అభ్యర్థి మాత్రం ప్రచారంలో వెనుకబడ్డాడు. టికెట్ ఆశించి రాని మాజీ మేయర్ బండ కార్తీక చంద్ర రెడ్డి నిరుత్సాహంతో పార్టీ ప్రచారంలో పాల్గొనలేదు కేవలం కేంద్ర నాయకుల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుత అభ్యర్థి మేకల సారంగపాణి కంటే ముందే పార్టీలో చేరి, 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండపల్లి సతీష్ ను ఈసారి పక్కన అధిష్టానం పక్కన పెట్టడంతో, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వల్ల సికింద్రాబాద్ లో పార్టీ కొంత మేర బలపడింది. ప్రస్తుతం ఆయన పార్టీ లో లేకపోవడంతో ఆ ప్రభావం కూడా అభ్యర్థిపై పడనుందని పలువురి అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పోయిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో సారంగపాణి ఇంటి నుండి బౌద్ధ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసిన ఆయన కోడలు గోరంగా ఓడిపోయింది. దీంతో కార్పొరేటర్ ను గెలిపించుకోలేని సారంగపాణి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడని పలువురు సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అభ్యర్థి మాత్రం గెలుపు నాదే అని ధీమా గా ఉన్నప్పటికీ బిజేపి నాయకుల్లో మాత్రం అది కనిపించడం లేదు. అందరిని కలుపుకొని పోకుండా అంతా తానే అన్నట్టు నడుస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇది సరైన పద్ధతి కాదని పలువురు పార్టీ నాయకులు వాపోతున్నారు. వేరే పార్టీ నుంచి బీజేపీ లోకి వచ్చిన వారికి బూత్ లు కేటాయించారు అని సొంత పార్టీ నాయకులు కాస్త గరంగా ఉన్నారు. దీంతో వారు ఎలాగైనా ఈ సారి సొంత పార్టీ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు