Sunday, July 21, 2024

అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌..

తప్పక చదవండి
  • ఖమ్మం జనగర్జన సభలో కీలక ప్రకటన చేసిన రాహుల్‌ గాంధీ..
  • రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. ల మధ్యే ప్రధాన పోటీ..
  • రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి..
  • తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
  • సభకు భారీ ఎత్తున హాజరైన కాగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు..
  • బీ.ఆర్.ఎస్. పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ తదితర నేతలు..

ఖమ్మం గుమ్మం సాక్షిగా కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసీలకు పోడు భూమలు పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం జనగర్జన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ. 4వేల పెన్షన్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ బీ టీమ్‌ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని, తెలంగాణలో బీజేపీ అడ్రస్‌ లేకుండా పోయిందని రాహుల్‌ పేర్కొన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర తెలంగాణకు రావడం ఎంతో సంతోషకరంగా ఉంది. నా యాత్రను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రలో దేశాన్ని కలిపే విషయమే అందరితో మాట్లాడాను. మన ఐడీయాలజీ కేవలం దేశాన్ని కలపడం మాత్రమే. దేశమంతా భారత్‌ జోడో యాత్రకు మద్దతుగా నిలిచింది. యాత్ర ద్వారా దేశంలో ద్వేషాన్ని, విద్వేషాన్ని దూరం చేసే ప్రయత్నం చేశాం’ అని రాహుల్‌ తెలిపారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన పొంగులేటిని రాహుల్‌ అభినందించారు. అలాగే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పులిలా పోరాడుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాహుల్‌ తెలిపారు. ‘ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట, ప్రతిసారి మమ్మల్ని ఆదరించింది. ఇక బీఆర్‌ఎస్‌ అంటే బీజేపీ రిస్తేదార్‌ పార్టీ. బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీటీమ్‌గా మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి తన జాగీరు అనుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు రూపాయల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్‌ సమస్యలను యాత్రలో తెలుసుకున్నాను. కేసీఆర్‌ హయాంలో రైతులు, ఆదివాసీలు, యువత, దళితులు అందరూ నష్టపోయారు. మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ ఉంది. సీఎం కేసీఆర్‌ అవినీతికి ప్రధాని మోడీ అండదండలున్నాయి.తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలు వస్తాయి. అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటాం. గిరిజనులకు పోడు భూములు ఇస్తాం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను కచ్చితంగా ఓడిస్తాం. కార్యకర్తలే కాంగ్రెస్‌కు వెన్నెముక. మీరు బీఆర్‌ఎస్‌ను సులభంగా ఓడిరచగలరు’ అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు రాహుల్‌…

ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. అనంతరం సభావేదికగా పొంగులేటి కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనట్లుగా తెలంగాణలో దాదాపు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకన్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేస్తానని నమ్మించి.. ఇప్పటికీ ఇచ్చిన హామీ నేరవేర్చలేదని విమర్శించారు. అలాగే నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా మోసం చేశారంటూ మండిపడ్డారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే డిక్లరేషన్‌లో ఉన్నట్లుగా రైతులకు, యువతకు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలుచేస్తామని పేర్కొన్నారు. జనగర్జన సభకు అడ్డంకులు వేసేందుకు బీఆర్‌ఎస్‌ వారం రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇబ్బందులను తట్టుకోని తమకు అండగా నిలబడిన కార్యకక్తలకు కృతజ్ఞతలని తెలిపారు. ఇక భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఇంటికి పంపించగలదని తెలిపారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు తనకు ఈ విషయాన్నే చెప్పారని.. వారి కోరిక మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.

- Advertisement -

ధరణికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడటానికి తామంతా సిద్దంగా ఉన్నాం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సభావేదికగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణిని రైతులు వ్యతిరేస్తున్నారని వ్యాఖ్యనించారు. ధరణికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడటానికి తామంతా సిద్దంగా ఉన్నామని తెలిపారు. పీపుల్స్‌ మార్చ్‌ యాత్రను ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభించాని.. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. రాష్ట్ర సందను సీఎం కేసీఆర్‌ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది కేవలం మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదన్నారు. అలాగే తాను చేపట్టిన పీపుల్స్‌ మార్చ యాత్ర కూడా భట్టి పాదయాత్ర కాదని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని పేర్కొన్నారు.ఈ యాత్రలో భాగంగా అనేక చోట్లు తిరిగానని.. తెలంగాణ వస్తే ప్రజలు తమ భూములు తమకు వస్తాయని అనుకున్నారని.. కానీ అధికార నేతలు పోడు భూములు లాక్కోడానికి ప్రయత్నించారని విమర్శించారు. పాదయత్రలో తమను ప్రజలు ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు