Sunday, May 19, 2024

కేంద్ర కేబినేట్ లోకి ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్.. !

తప్పక చదవండి
  • నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం..
  • జీ-20 సమావేశానికి ఆతిధ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్ లో సమావేశం..
  • ప్రాధాన్యత సంతరించుకున్న కేంద్ర మంత్రి మండలి మీటింగ్..
  • కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులకు అవకాశం..
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి నేడు సమావేశమవుతోంది. సెప్టెంబర్‌లో జి-20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మంత్రి మండలి సమావేశం జరుగనుంది.. మంత్రి మండలి పునర్వవస్థీకరణ గురించిన ఊహాగానాలు కొద్దిరోజులుగా బలంగా వినిపిస్తు్ండటం, మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుని ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తనకు మద్దతుగా నిలిచిన 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరడం వంటి కీలక పరిణామం నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేంద్ర కేబినెట్‌లోకి ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవిస్?

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో భాగంగా అజిత్ పవార్‌తో చేతులు కలిపిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు కేంద్ర క్యాబినెట్‌లో చేటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సైతం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. భాగస్వామ్య పార్టీలకు కూడా క్యాబినెట్ మార్పులు, చేర్పుల్లో చోటు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, పార్లమెంటు వర్షాకాల సమవేశాల తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం జరగడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు