Friday, May 3, 2024

భాగ్యనగరం చేరుకుంటున్న అయోధ్య శ్రీరామ అక్షింతలు

తప్పక చదవండి

హైదరాబాద్ : సోమవారము అయోధ్య నుండి శ్రీరామ అక్షింతలు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకోవడం జరుగుతుందని అక్కడి నుండి తుక్కుగూడ మీదుగా శోభాయాత్రగా బయలుదేరి కర్మానట్ హనుమాన్ దేవాలయనికి చేరుకుంటాయి. అక్కడ పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో యజ్ఞం మరియు పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీరామ అక్షింతలు ప్రతి హిందూ కుటుంబానికి చేరవేయడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శాలివాహన పండరినాథ్, సహకార్యదర్శి గణాపురం రాజేశ్వర్ రెడ్డి, బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ యు . శివరాములు, ప్రాంత సత్సంగ్ సహప్రముఖ్ రాంరెడ్డి పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు-తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ జనవరి 22 సోమవారము రోజున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజు ప్రతి హిందువు దేవాలయము మరియు మన ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ట సమయానికి అక్షింతలను తమ తలపై వేసుకోవాలని తెలిపారు. అయోధ్య నుండి మన భాగ్యనగరానికి చేరుకుంటున్న శ్రీరామ అక్షింతలను యువకులంతా స్వాగతం పలికి శంషాబాద్ విమానాశ్రయం నుండి కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం వరకు జరిగే శోబాయత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు