Saturday, April 27, 2024

ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం

తప్పక చదవండి
  • విక్రమ్‌ దిగిన ప్రదేశాకి శివ్‌ శక్తి పాయింట్‌గా నామకరణం
  • ప్రజ్ఞాన్‌ పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు
  • విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక
  • శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు
  • భారత్‌ వెలుగుదిక్సూచిగా మారిందని కితాబు
  • చంద్రాయన్‌ శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ ప్రశంసలు

చంద్రయాన్‌3 మిషన్‌ విజయవంతం అయినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అభినందించారు. సైన్స్‌ను, భవిష్యత్తును విశ్వసించే ప్రపంచ ప్రజలందరూ భారత్‌ సాధించిన విజయం పట్ల ఉత్సాహంతో ఉన్నారని ప్రధాని అన్నారు. గ్రీన్‌ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరులో దిగిన ప్రధాని మోడీ ఇస్రో చేరుకుని శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ చేరుకునే ముందు ఆయన హెచ్‌ఎఎల్‌ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్‌ దిగిన ప్రదేశాన్ని శివ్‌ శక్తి పాయింట్‌గా వ్యవహరించనున్నట్లు ప్రధాని తెలిపారు. చంద్రయాన్‌ తన పాదముద్రలను వేసిన ప్రదేశాన్ని తిరంగా అని పిలుస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించనున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రయాన్‌3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో ఎవరూ సాధించని విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సాధించారని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం దూసుకెళ్తోందని చెప్పారు. మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. చంద్రయాన్‌3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల సమక్షంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోదీ నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ మిషన్‌ కంట్రోల్‌ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశం ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతోందన్నారు. సృష్టికి ఆధారం నారీశక్తి అని తెలిపారు. చంద్రయాన్‌3లో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. చంద్రయాన్‌3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించామని తెలిపారు. బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొనడం కోసం తాను దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నప్పటికీ, తన మనసంతా చంద్రయాన్‌3పైనే ఉందని తెలిపారు. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణమని తెలిపారు. ఈ విజయం అసాధారణమైనదని, అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త చరిత్రను సృష్టించిందని తెలిపారు. విజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వినియోగించాలన్నారు. విూ వైజ్ఞానిక సేవలకు గౌరవ వందనం చేస్తున్నాను అని మోదీ చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు