Friday, May 10, 2024

నేడు ఖమ్మం పర్యటనకు అమిత్‌ షా

తప్పక చదవండి
  • ఎన్నికలకు ముందు బిజెపికి బూస్ట్‌
  • ఏర్పాట్ల పరిశీలనలో ఈటెల రాజేందర్‌

ఖమ్మంలో అమిత్‌ షా బహిరంగ సభకు భారీగా ఏర్పట్లు చేసారు. ఆదివారం సాయంత్రం బిజెపి నేత, హోంమంత్రి అమిత్‌ షా ఇక్కడికి రానున్నారు. బిజెపి ప్రచారంలో భాగంగా అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి సభతో తెలంగాణలో మరోమారు బిజెపికి బూస్ట్‌ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే కెసిఆర్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్‌ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్‌లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశర చేస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు అమిత్‌ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనపై ప్రజలు విసుగుచెందారని, ఆయనను పాలన వద్దనుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌( అన్నారు. ఈనెల 27న సాయంత్రం ఖమ్మంలో జరిగే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ నాలుగు నెలలుగా అధికార దుర్వినియోగం చేస్తూ డబ్బుసంచులతో రాజకీయం మొదలుపెట్టిందన్నారు. ఖమ్మం వ్యవసాయ అగ్రగామిగా ఉన్న జిల్లా అని, ఇక్కడ రైతులకు ఎలాంటి న్యాయం జరగడంలేదన్నారు. ఎండు మిర్చికి ధర తక్కువగా ఉందని, ప్రశ్నించిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన ఘనత ఈ ప్రభుత్వానిదని మండిపడ్డారు. జిల్లాలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారని, ప్రభుత్వం వారికి మోసపూరిట మాటలు చెబుతూ వారికి ఉన్న పోడుభూములను చేస్తోందన్నారు. గిరిజన రైతులు అటవీఅధికారుల కాళ్లవిూద పడి తమకు భూములు కేటాయించాలని అడిగితే, వారిని వారిని బూటుకాలితో అధికారులు తన్నారని, కనీసం గోడు వినలేని స్థితిలో ఈప్రభుత్వం ఉందన్నారు. ఇక్కడి పండిరచిన వరికి సరైన ధర లేక రైతులు వరికుప్పల దగ్గర పడుకుంటున్నా రని, ధాన్యం అమ్మాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిరదని, ఇది సిగ్గులేనితనమని విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు