Monday, May 6, 2024

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది

తప్పక చదవండి
  • డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన రాష్ట్రంలో కొలువులు దొరకని పరిస్థితి
  • కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు చేయూత
  • జాబ్ మేళా తో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయి
  • రానున్న రోజుల్లో జాబ్‌మేళ కార్యక్రమాలను గ్రామాలకు విస్తరిస్తాం
  • చదువుకున్న విద్యార్థులకు కాసాని ఫౌండేషన్ భరోసాగా ఉంటుంది
  • కాసాని ఫౌండేషన్ చైర్మన్,పరిగి నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే
  • తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి..
    హైదరాబాద్ :- చదువుకున్న నిరుద్యోగులయిన యువతీ, యువకులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని కాసాని ఫౌండేషన్ చైర్మన్,పరిగి నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ,తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఆరోపించారు. శనివారం పరిగి పట్టణంలోని కొప్పుల శారద గార్డెన్స్ లో నిరుద్యోగ యువతీ, యువకుల భవిష్యత్తు కోసం కాసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్నికాసాని వీరేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులయిన యువతీ,యువకుల నుంచి విశేష స్పందన వచ్చిందని కాసాని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 100కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు.ఈ జాబ్ మేళాకు మొత్తం 2000 మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 1000 మందికి ఉద్యోగ కల్పన జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపించి.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కపట ప్రేమను కురిపిస్తుందని అన్నారు.

ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉంటె .. నిరుద్యోగులయిన యువతపై ప్రేమ అభిమానాలు ఉంటె ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న పనులను,పాలకుల వైఫల్యాలను గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్న ఆయన రానున్న ఎన్నికల్లో పాలకులకు, ప్రభుత్వానికి ఓటుతో చక్కటి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సారి జరిగే ఎన్నికలు ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే పాలకులకు, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేవిధంగా ఫలితాలు ఉండబోతున్నాయని వారు జోస్యం చెప్పారు. ఎన్నికల వేళ పలువురు నాయకులు ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని యువకులు భాద్యతగా సరైన అభ్యర్థిని ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యం చేసే గురుతర భాద్యతను స్వీకరించాలని సూచించారు. మంచి నాయకుల చేతుల్లో అధికారం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని ఆ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసే భాద్యతను యువకులు భుజాన వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక కళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రహాస్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాణిక్యం, బాబు, శ్రీశైలం,బాల ముకుందం, విజయ భాస్కర్ గౌడ్, మాసయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామపెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు