Wednesday, May 1, 2024

అమాయకుల జీవితాలను ‘హారతి’ చేస్తున్న ‘భారతి’ బిల్డర్స్..

తప్పక చదవండి
  • ప్రీలాంచ్ పేరుతో మరో దగా డ్రామా..
  • మరో సాహితీ కానున్న భారతి బిల్డర్స్.. ?
  • ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో రెచ్చిపోతున్న రియల్టర్స్..
  • ఒకచోట ప్రాజెక్టు మొదలుపెట్టి, అక్రమ వసూళ్లు చేసి, మరోచోట భూమికి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ కూడా దోపిడి..
  • ప్రస్తుతం ముచ్చటగా మూడోచోట కోకా పేటలో దుఖాణం..

మోసపోతున్నారు..

హైదరాబాద్ : భారతి బిల్డర్స్ అధినేత శివరామ కృష్ణ ములుకూరి.. ఓ లగ్జీరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును కొంపల్లిలో సుమారు 7 ఎకరాల్లో.. 2021లో మొదలుపెట్టాడు.. ప్రీ లంచ్ పేరుతో తన దగాకోరు దందాకు తెరలేపాడు.. 8 బ్లాకులు, 9 ఫ్లోర్లతో ప్రాజెక్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ నిస్సిగ్గుగా మరో మోసాన్ని యథేచ్ఛగా కొనసాగించాడు.. దాదాపు 656 డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మేశారు.. కేవలం డీసీ లెటర్ తోనే మొదటి అంతస్థు వరకు నిర్మించాడు.. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పేరు చెప్పుకుని థర్డ్ పార్టీ నుంచి రూ. 30 కోట్లు ఫైనాన్స్ తెచ్చాడు ఎలాంటి బెరుకు లేకుండా.. కాగా ఆ డబ్బులతో భానూర్ లో సుమారు 6 ఎకరాల భూమికి అడ్వాన్స్ చెల్లించి, కేవలం అగ్రిమెంట్ చేసుకుని 5 టవర్లు, 15 ఫ్లోర్లు, 960 ఫ్లాట్స్ అంటూ సరికొత్త డ్రామాను తెరమీదకు తీసుకునివచ్చి, ప్రీ లాంచ్ పేరుతో అమాయకులకు అంటగట్టేశాడు.. ఇక ఇక్కడ వచ్చిన డబ్బులతో.. ఇంకా మరిన్ని చోట్లలో అడ్వాన్స్ లు ఇచ్చి, అగ్రిమెంట్ చేసుకుని, కమర్షియల్, రెసిడెన్సియల్ ఫ్లాట్స్ అమ్మకాలు మొదలెట్టాడు.. మేనేజింగ్ డైరెక్టర్ గా శివరామ కృష్ణ ములుకూరి..డైరెక్టర్ గా నాగరాజు దూపతిలు వ్యవహరిస్తున్నారు.. ఇక ఈ కంపెనీ సీఈఓ గా చెప్పుకుంటూ విధులు నిర్వహిస్తున్న పూనరీ తనమేధస్సును రంగరించి ఈజీగా ప్రీ లాంచ్ పేరుతో అమ్మకాలు నిర్వహించినట్లు తెలుస్తోంది..

- Advertisement -

అయితే ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వీరు ఏవిధంగా ఇదంతా చేయగలుగు తున్నారు.. పైగా కన్ స్ట్రక్షన్ విలువ చదరపు మీటర్ రూ. 3000 పైనే ఉంటుంది.. కానీ వీరు కేవలం రూ. 1500 ఇస్తున్నారు.. ఇదెలా సాధ్యం అవుతోంది.. జనాలను మోసం చేయాలనే ఉద్దేశ్యంతోనే, ముందుగానే పతాక రచన చేసి ఇదంతా చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.. ఇంకా తమకు అనుకూలమైన ఏజెంట్లను పెట్టుకుని, అమాయకులను టార్గెట్ చేసుకుని ఘరానా మోసం చేస్తున్నారు.. కాగా వీరుకూడా సాహితి దారిలో నడుస్తున్నారా..? అన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతోంది.. దాదాపు 1500 మంది బాధితుల పరిస్థితి ఏమిటి..? తమగోడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక గొల్లుమంటున్నారు.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గానీ, రేరా లాంటి
ప్రభుత్వరంగ సంస్థలు గానీ ఏమి చేస్తున్నాయి..? ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండటం గర్హనీయం.. ఇక ఇప్పడు భారతి బిల్డర్స్ వారు కోకాపేటలో కొత్తగా తెరచిన మరో మోసపూరిత దుఖాణంపై పూర్తి వివరాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు