Tuesday, May 21, 2024

రాబోయేది మోదీ రాజ్యమే…

తప్పక చదవండి
  • బీజేపీకి అడ్డొస్తే మాడి మసైపోతారు…
  • అసలు కేసీఆర్ కు ఏమైంది?
  • కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేస్తున్నాడేమోననే భయం వేస్తోంది..
  • బీఆర్ఎస్ కు అసలు ఓటెందుకు వేయాలి?
  • ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఆ పార్టీకే ఓటేయండి..
  • ఒక్కసారి తప్పు చేస్తే మళ్లీ 5 ఏళ్లు గోస పడతాం..
  • కర్నాటకలో కాంగ్రెస్ ట్రయిలర్ హిట్… సినిమా అట్టర్ ఫ్లాప్…
  • బండి సంజయ్ ప్రసంగానికి ఫిదా…. చప్పట్లు, కేరింతలు, నినాదాలతో ఊగిపోయిన సభ..

( బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కుట్రలు జరుగుతున్నాయ్.. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాలో హిందువులపై దాడి చేసి ధ్వంసం చేసిన వాళ్లను బట్టలూడదీస్తాం.. పాకిస్తాన్ జెండాలు ఎగరేసిన లుచ్చాలను ఎన్ కౌంటర్ చేసి పాకిస్తాన్ లోనే పాతిపెడతాం.. ఆదిలాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం.. ఆదిలాబాద్ జిల్లా సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్.. )

హైదరాబాద్ : ‘‘తెలంగాణలో రాబోయేది బీసీ నేత నరేంద్రమోదీ రాజ్యమే. ఎవరు అడ్డుకోవాలని చూసినా మాడి మసైపోతారు’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలైనట్లు భావిస్తే ఆ పార్టీకే ఓయాలని సూచించారు. ఈసారి తప్పు చేస్తే మరో 5 ఏళ్లు గోసపడక తప్పదని హెచ్చరించారు. భారత్ గడ్డపై పాకిస్తాన్ జెండా ఎగరేసే లుచ్చాగాళ్లను ఎన్ కౌంటర్ చేసి పాకిస్తాన్ లోనే పాతిపెట్టే రోజులు రాబోతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మైనర్ బాలికలపై అత్యాచారం చేసే లుచ్చాలను బట్టలూడదీసి కొడతామని చెప్పారు.

- Advertisement -

ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ బహిరంగసభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. బండి సంజయ్ రాకను మొదలుకుని ప్రసంగించేంత వరకు సభకు తరలివచ్చిన జనమంతా చప్పట్లు, ఈలలు, నినాదాలతో స్వాగతం పలికారు. మోడీ.. మోడీ… బండి… బండి.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….

హిందుత్వ అడ్డా… కొమరం భీం, రాంజీగోండు వారసుల గడ్డ ఆదిలాబాద్ జిల్లాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ఆనాడు నిజాం మెడలు వంచేందుకు తెలంగాణకు సర్దార్ వల్లభాయిపటేల్ వస్తే…. ఈనాడు కేసీఆర్ మెడలు వంచి బీజేపీ పాలన తెచ్చేందుకు వచ్చిన అభినవ సర్దార్ వల్లభాయి పటేల్ అమిత్ షాకు కు తెలంగాణ ప్రజల పక్షాన స్వాగతం చెబుతున్నా… కేసీఆర్ సార్ కు ఏమైంది? ఎందుకు కనుబడట లేదు… కేసీఆర్ మా గురువు.. ఆయన దగ్గరే భాష నేర్చుకున్నా… ఆయనకు ఏమైంది? మా ముఖ్యమంత్రి మాగ్గావాలే… ఆయన కొడుకు సీఎంను ఏం చేసిండోననే భయం మాకుంది. ఆయన ఆయురోగ్యాలతో బాగుండాలే… సర్వేజన సుఖినోభవంతు.. వచ్చేది మోదీ రాజ్యం… అమిత్ షా రాజ్యం… రామరాజ్యం. ఎవరూ అడ్డురాలేరు.. ఎవరైనా అడ్డొస్తే బీజేపీ కార్యకర్తల ధాటికి తట్టుకోలేరు. బీఆర్ఎస్ కు అసలు ఎందుకు ఓటేయాలి?…. గిరిజన భూములకు పోడు పట్టాలిచ్చారా? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా? ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చారా?… పేదలకు పట్టాలిచ్చారా? రైతులకు సబ్సిడీలిచ్చారా… ఫ్రీ యూరియా ఇచ్చారా?… అవన్నీ ఇస్తే ఓటేయండి…నిరుద్యోగ భ్రుతి ఇచ్చారా? ఉద్యోగాలను భర్తీ చేశారా? అవన్నీ చేస్తేనే ఓటేయండి. మరెందుకు బీఆర్ఎస్ కు ఓటేయాలి. 5 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? మహిళలపై అత్యాచారాలను ఆపలేకపోయినందుకు ఓటేయాలా? టీఎస్సీపీఎస్సీ పరీక్షలు నిర్వహించలేనోళ్లు, గ్రూప్ 1 పరీక్షలను లీక్ చేసినోళ్లు, డీఎస్సీ కూడా నిర్వహించలేని పార్టీకి ఎందుకు ఓటేయాలి.. కాంగ్రెస్ అతీగతీలేని పార్టీ. ఆ పార్టీ కర్నాటకలో వేసిన ట్రయిలర్ హిట్… సినిమా అట్టర్ ఫ్లాప్. కర్నాటకలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు చినుగుతున్నయ్. ఆచరణ సాధ్యం కాని హమీలిస్తోంది. నేనడుగుతున్నా…. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎట్లా అప్పుల తీర్చగలుగుతుంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి తీసుకొస్తారా? ఆ రెండు పార్టీలు సమాధానం చెప్పాలి.

తెలంగాణలో అప్పులు తీరాలన్నా, పేదల బతుకులు బతకాలన్నా….కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. బీసీ నేత అయిన మోదీగారి ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి రావాలి. వచ్చేది బీజేపీ రాజ్యమే. బీజేపీ అభివ్రుద్ధి గురించి మాట్లాడుతుంటే మతతత్వ పార్టీ అంటారా? బైంసా ఘటనను మర్చిపోగలమా? నా హిందూ తమ్ముళ్లపై పీడీ యాక్ట్ లు పెట్టి జైళ్లకు పంపిన సంగతి మర్చిపోతామా? పేద హిందువుల మీద, మహిళల మీద దాడి చేసి దగ్దం చేసిన సంగతి మర్చిపోదామా? బైంసాలో విధ్వంసం చేసి హిందూ సమాజంపై దాడి చేసిన లుచ్చా నా కొడుకుల బట్టలూడదీసి ఉరికించే మోదీ రాజ్యం రావాలి. మైనర్ బాలికలపై అత్యాచారం చేసే ఎంఐఎం లుచ్చాగాళ్లను ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నయ్.. ఎక్కడో ఇస్తాంబుల్ లో ఎవడికో పుట్టినోడిని ఇక్కడికి తీసుకొచ్చి అధికారికంగా అంత్యక్రియలు చేస్తే ఒప్పుకుందామా? ఇక్కడ భారతమాతాకీ జై అనకుండా కొండలు, గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు ఎగరేసిన లుచ్చా నాకొడుకులను ఇక్కడే ఎన్ కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతిపెట్టే రోజులు రావాలి. ప్రజలారా… దయచేసి మీ సమయాన్ని వ్రుధా చేసుకోకండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్లు మన జీవితాలు బర్ బాద్ అవుతాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి అధికారాన్ని పంచుకోవాలని కుట్ర చేస్తున్నయ్. పేదల రాజ్యం రావాలి. ఇక్కడున్న 5 స్థానాలు బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతోనే అమిత్ షా ఈ జిల్లా నుండే ఎన్నికల యుద్ద సైరన్ మోగించేందుకు వచ్చారు. అందులో భాగంగా ఈ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ప్రసంగాన్ని ముగిస్తున్నా. భారత్ మాతాకీ జై…అంటూ నినదించారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు