Friday, May 3, 2024

అతివలపై అరాచకం- ఆధునిక యుగానికి శాపం

తప్పక చదవండి

ఆకాశంలో సగం అతివ అంటూ ఒకవైపు పొగడ్తలతో స్త్రీలను ముంచెత్తడం, మరోవైపు స్త్రీలపై అణచివేత కొనసాగించడం ద్వంద్వ నాలుకల ధోరణికి అద్దం పడుతున్నది.స్త్రీలను శారీరకం గా, మానసికంగా హింసించి ఆనందించడం మానవ లక్షణాలు కోల్పోయిన దుర్మదాంధులు చేసే వికృత క్రీడలో ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలపై ఇంకా అనేక అరాచకాలు, అత్యాచా రాలు కొనసాగుతున్నాయి.పశువాంఛతో స్త్రీలను హింసించి, హతమార్చే నీచ సంస్కృతి మారాలి.పాఠశాలలకు పంపించా లంటే భయం.పై చదువులు చదవించాలంటే భయం. ఉద్యో గాలు చేయా లంటే భయం…అంతెందుకు మాతృ గర్భం నుండి జన్మించిన మరుక్షణం నుండే ఆడజన్మకు అగచాట్లు ఎదురౌతు న్నాయి. భ్రూణ హత్యల నుండి, లైంగిక అత్యాచారాల వరకు, వరకట్న వేధింపుల నుండి, హత్యల వరకు అనాదిగా స్త్రీ జాతి ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. స్త్రీ ని అగౌరవంగా చూస్తూ, శీల హననానికి గురి చూసే ఆటవిక ప్రవృత్తి మారాలి. ఇదో రంగుల ప్రపంచం. అను నిత్యం వినూత్నమైన సంఘటన లతో నిత్య నూతనంగా కనిపించే కృత్రిమ ప్రపంచంలో జీవించ డమే ఆధునిక నాగరికత నేర్పిన అరుదైన విద్య మానవత్వం స్థానంలో ‘పశుత్వం’ ప్రబ లినా అలాం టి అమానుషత్వాన్నే కనులారా వీక్షించి, మనసారా ఆస్వా దించి, ఆరాధించే మనస్త త్వాలతో ఆటవిక నాగరికత పునరా రంభం కాబోతున్నది. దాన వత్వాన్ని పునరావృతం చేసి, సర్వత్రా వ్యాపిం పచేసి, ఆనందిం చడమే ఒక కళగా మారిన నేప థ్యంలో మానవ త్వమనే మాట చమురులేని దీపంలా ఆరిపోవ డంలో ఆశ్చర్యమే మీ లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించా లనే మేథావుల మాటలు, ప్రవచనకర్తల ఉపదేశాలు కేవలం వినడా నికే తప్ప ఆచరించడా నికి అవకాశం లేని పరిస్థితులు దాపురిం చాయి. భారతదేశం అనాదిగా విలువలకు ప్రతిరూపం. కొందరి ప్రబుద్ధు ల వక్రబు ద్ధుల వలన మానవసమాజం అప ఖ్యాతి పాలవుతున్న నేపథ్యం లో ఆవేదనతో, ఆక్రందనతో ప్రశ్నిం చాలని ప్రయత్నించ డం నిజంగా ఒక అభ్యు దయ భావమే. ఒక చైతన్యవికాసమే. అయితే ప్రశ్నించే గళాలు మూగబోతున్నాయి. నిరాశతో నిశ్శబ్దం ఆవహి స్తున్నది. ఆక్రోశంతో, ఆవేశంతో, తమ ఆవేదన ను వెళ్లగ్రక్కే కలాలు నిశ్శబ్ధంతో చెలిమి చేస్తున్నాయి. ఇది ఈనా టి సమస్య కాదు. ఇది అనాదిగా సాగుతున్న తంతు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పైశాచిక క్రీడా విన్యాసం పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, రాజ్యాం గంలో ఎన్ని సవరణ లొచ్చినా, ప్రజల్లో ఐక్యత కొరవడిన కారణం గా చట్టాలను సైతం నిర్వీర్యం చేసే చీకటి వ్యవస్థలు పుట్టగొడు గుల్లా పుట్టు కొస్తున్నాయి.స్త్రీల పట్ల చులకన భావనతో వారిని ఆర్ధికంగా ఎదగనీయకుండా అన్ని రంగాల్లో అణగద్రొక్కే పురుషా ధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తూ ఎంతో మంది మహిళా మణులు సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక,రాజకీయ, విద్య, వ్యాపార, విజ్ఞా న సాంకేతిక రంగాల్లో ప్రవేశించి తమ నైపుణ్యంతో ప్రపంచాన్నే శాసిస్తూ స్వావలంభన, సాధి కారత దిశగా పయనించడం నడు స్తున్న చరిత్రలో చోటు చేసుకుంటున్న మహిళల ప్రతిభా పాట వాల ప్రగతి కి సంబంధిం చిన పరి వర్తనా క్రమం. అయితే మహిళలను చులక నగా చూడడం, వారిని ఆర్థికంగా ఎదగనీయక పోవ డం, మహిళల పట్ల హింసాత్మక ధోర ణి పెంపొ ందించు కోవడం ఆధునిక యుగం లో కొనసాగు తున్న అజ్ఞానానికి పరా కాష్ఠ. మహి ళలను హింసించే వైఖరి నశించాలి. ప్రపంచవ్యాప్తంగా మహిళ లపై కొనసాగుతున్న హింస జుగుప్సా కరం. అంతర్జాతీయ సమాజం ఇకనైనా మేల్కొనకపోతే భవిష్యత్తు లో స్త్రీ జాతి అంత రించి పోయి, మగువ లేని ప్రపంచం ఆవిర్భ వించే విపరీత పరి ణామాలు సంభ వించే అవకాశాలు న్నాయి. ఇటీవలి కాలంలో టెక్నాలజీ ఆధారిత డీప్‌ ఫేక్‌ వీడియోలు మహిళా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం విదితమే. మహిళల గౌరవాన్ని మంటగలుతున్న సాంకే తిక మాధ్య మాల పట్ల జాగరూకత వహించాలి. మహిళల పట్ల కొనసాగు తున్న హింసకు స్వస్తి పల కాలి. నవంబర్‌ 25 వ తేదీన జరిగే అంతర్జా తీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవం సమాజంలో పరివర్తన తీసుకురావడానికి దోహదం చేయాలని ఆశిద్ధాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు