Wednesday, February 28, 2024

ప్రజల కోసం నీలం పది భరోసాలు..

తప్పక చదవండి
  • అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా రూపకల్పన…
  • రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి పెద్ద పీట..
  • ఆరోగ్యం, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..
  • సుపరిపాలన, మౌళిక వసతుల కల్పన పై శ్రద్ధ..
  • ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా..
  • పటాన్‌ చెరు లో గూండాగిరికి చరమ గీతం..
  • చిట్కుల్‌ లో సర్వేనెంబర్‌ 309లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ..
  • ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యేకు సవాల్‌..
  • ఆదరించండి.. ఆశీర్వదించండి.. బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌…

పటాన్‌ చెరు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేపట్టబోయే పనుల కోసం ప్రజలకు చేసే మంచి కోసం నీలం మధు ముదిరాజ్‌ నీలం మదన్న పది భరోసాల పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ఈ మ్యానిఫెస్టో రూపకల్పన చేశారు. ముఖ్యంగా రైతులు, మహిళలు యువత, నిరుద్యోగులకు ఉపాధి తోపాటు ప్రతి ఇంటికి సంక్షేమం, ఆరోగ్యం తో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం తో పాటు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మ్యానిఫెస్టో రూపొందించారు. గురువారం చిట్కుల్‌ లోని ఎన్‌ ఎమ్‌ అర్‌ కార్యాలయంలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ స్థానిక నాయకులతో కలిసి ‘‘పటాన్‌ చెరు ప్రజలకు నీలం మధు అన్న భరోసా’’ మ్యానిఫెస్టో ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన తాను అన్ని రకాల సమస్యలను కష్టాలను చూసి స్వశక్తితో ఎదిగానన్నారు. పేదింటి బిడ్డ గా ప్రజల కష్టాలు స్వయంగా తెలుసని ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ మ్యానిఫెస్టో తయారు చేశామన్నారు. మీ ఇంటి బిడ్డ మీ ఇంటి గుమ్మంలో పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూశానని, ప్రజల కోరిక మేరకు ప్రజాభిష్టానికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించమన్నారు.
ఈ పది భరోసాలతో ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, ఉపాది తో పాటు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలలో పని చేసే కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడంతోపాటు మౌలిక వస్తువుతో కల్పనకు సైతం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వివరించారు. ముఖ్యంగా పటాన్‌ చెరు ప్రాంతంలో గుండా గిరి ని పూర్తిగా అణచి వేయడంతో పాటు కమిషన్లు లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలంతా ఒకసారి తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని స్పష్టం చేశారు. గుడ్‌ మార్నింగ్‌ పటాన్చెరు పేరుతో ప్రజల వద్దకు వెళ్లి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నేను ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా ప్రజలు తనను నిలదీయవచ్చన్నారు. పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి మాటిమాటికి అవినీతి నిరూపించాలని సవాల్‌ విసురుతున్నాడని ఇదిగో ఇవే నీ అవినీతికి సాక్షాలని తెలిపారు. చిట్కుల్లో సర్వేనెంబర్‌ 309 లో 2004లో వెంచర్‌ పూర్తయి ఇండ్లు నిర్మించిన స్థలాన్ని పక్కనున్న దేవాదాయ స్థలం చూపి కాజేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ స్థలానికి సంబంధించి వ్యవసాయ పట్టా పాస్‌ పుస్తకం మ్యూటేషన్‌ మీ కుటుంబ సభ్యుడి పేరు వచ్చింది వాస్తవమా కదా ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. అమీన్పూర్‌ లో సర్వేనెంబర్‌ 1001 నుంచి 1056 తో పాటు పటేల్‌ గూడా లో నీ అనుచరుల భూభాగోతం, మాంబాపూర్‌ లో వందల ఎకరాల భూ కబ్జా విషయాలు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సభ సాక్షిగా పోటీ నుంచి తప్పుకుంటున్న ఎమ్మెల్యే తన మాట నిలబెట్టుకోవాలని సవాలు విసిరారు. పటాన్‌ చెరు ప్రజలు తెలివైన వారిని ఈ అవినీతి బాగోతాలు చేసిన ఎమ్మెల్యేని ఈ దఫా ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ఒకసారి తనకు అవకాశం కల్పిస్తే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు పటాన్చెరు నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు