Monday, May 27, 2024

హమాస్‌ దాడిలో ఇరాన్‌ పాత్రపై మరోమారు స్పందించిన అమెరికా

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ పాత్రపై నిర్దిష్ట సమాచారమేవిూ లేదని అమెరికా తెలిపింది. మిలిటెంట్ల గ్రూపులోని పోరాట విభాగానికి నిధులు అందిస్తున్నట్లు మాత్రం స్థూలంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘హమాస్‌కు పోరాటంలో సింహభాగం నిధుల్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. మొదటి నుంచీ మేం ఇదే చెబుతున్నాం. వారికి కావాల్సిన శిక్షణ ను ఆ దేశమే ఇచ్చింది. ఇతరత్రా శక్తిసామర్థ్యాలను అదే సమకూర్చింది. చాలాఏళ్లుగా హమాస్‌తో వారు సంప్రదింపుల్లో ఉన్నారు. ప్రస్తుత పరిణామాలకు ఇవన్నీ కలిసి కారణమయ్యాయి. దాడి గురించి ఇరాన్‌కు ముందే తెలుసా, ఆ దేశమే దానికి ప్రేరేపించిందా అనేది మాకు తెలియదు. వీటిపై ఇజ్రాయెల్‌తో రోజువారీ ప్రాతిపదికన మాట్లాడుతున్నాం’ అని అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జేక్‌ సులివాన్‌ విలేకరులకు చెప్పారు. అటు ఉక్రెయిన్‌కు, ఇటు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా తమ సహకారం కొనసాగుతుందని చెప్పారు. ఇక, హమాస్‌ దాడుల్లో 22 మంది అమెరికన్లు మరణించారని అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మరికొంతమంది గాజాలో బందీలుగా ఉన్నారని చెప్పారు. పశ్చిమాసియా ఘర్షణ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. హమాస్‌ కు మద్దతుగా దాడులకు దిగవద్దని ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లను హెచ్చరిం చారు. అమెరికా నుంచి తొలి విడత ఆయుధ సామగ్రి ఇజ్రాయెల్‌ చేరుకుంది. బుధవారం కార్గో విమానంలో ఇవి వచ్చాయని పేర్కొంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఒక వీడియోను విడుదల చేసింది. బైడెన్‌ వ్యాఖ్యలపై హమాస్‌ స్పందించింది. అవి పక్షపాతంతో కూడుకున్న వ్యాఖ్యలని విమర్శిం చింది. ఇజ్రాయెల్‌ ఆక్రమణలను అడ్డుకోవడానికి పోరాడటం పాలస్తీనా వాసుల హక్కని స్పష్టంచేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు