Monday, June 17, 2024

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తప్పక చదవండి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, BRS నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కు సంబంధించిన విషయమని అన్నారు. అలాంటి తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. స్వార్థ ఇతర ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది నేరమే అని అన్నారు

అలా చేసిన వాళ్ళు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షర్హులేనని, ఒక పోలీసు అధికారిగా, రిటైర్డు అధికారిగా నేను ఈ మాట చెబుతున్నా అని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పరంగా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేసినా కూడా తప్పే అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు