Wednesday, May 15, 2024

కెనడా హిందూ దేవాలయాలలో దొంగతనాలు

తప్పక చదవండి

ఓట్టావా : కెనడాలోని హిందూ దేవాలయాలే లక్ష్యంగా దొంగలు రెచ్చిపో తున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు వరుస దొంగతనాలు జరగటం అక్కడి హిందువుల్ని ఆందో ళనకు గురిచేసింది. ఈ ఘటనలపై కెనడా పోలీసులు అనుమానితుడి కోసం వెదుకులాట ప్రారంభిం చారు. నిందితుడి ఆనవాళ్లు చెబుతూ స్థానిక ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గ్రేటర్‌ టొరొంటో ఏరియా లోని ఓ హిందూ దేవాలయంలో దొంగ చొరబడి, అక్కడున్న డొనేషన్‌ బాక్సుల్లో నుంచి పెద్దమొత్తంలో నగదు చోరీ చేశాడు. అజాక్స్‌ పట్టణంలోనూ చోరీ జరిగింది. మొత్తం మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడిరది ఒకే వ్యక్తి’ అని దుర్హాం రీజినల్‌ పోలీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు