Tuesday, April 30, 2024

మూడో రౌండ్‌కు అర్హత సాధించిన అల్కరాజ్‌

తప్పక చదవండి

స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. బుధవారం మెల్‌బోర్న్‌ లోని రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల రెండో రౌండ్‌ పోరులో అల్కరాజ్‌.. 6-4, 6-7 (3-7), 6-3, 7-6 (7-3) తేడాతో లొరెంజొ సొనెగొ (ఇటలీ)ను ఓడిరచాడు. తద్వారా అతడు మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ విజయం ద్వారా అల్కరాజ్‌ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలలో అల్కరాజ్‌కు ఇది 15వ విజయం. ఓపెన్‌ ఎరాలో భాగంగా పురుషుల టెన్నిస్‌లో 21 ఏండ్లకే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో వరుసగా 15 మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లలో (21 ఏండ్ల లోపు) అండీ రూబెక్‌, నొవాక్‌ జొకోవిచ్‌, లిటన్‌ హెవిట్‌లను అధిగమించాడు. ప్రస్తుతం అల్కరాజ్‌ వయసు 20 ఏండ్లు మాత్రమే. తొలి రౌండ్‌లో కష్టపడి నెగ్గిన అల్కరాజ్‌కు రెండో రౌండ్‌లోనూ పోరాడాల్సి వచ్చింది. తొలి సెట్‌లో గెలిచిన ఈజీగానే నెగ్గిన అతడు.. తర్వాత సెట్‌లో ఓడాడు. కానీ తర్వాత పుంజుకుని సొనెగొను మట్టికరిపించాడు.రెండో రౌండ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లలో భారత ఆటగాడు సుమిత్‌ నాగల్‌.. 6-2, 3-6, 5-7, 4-6 తేడాతో షాంగ్‌ (చైనా) చేతిలో ఓడాడు. టాప్‌ సీడ్‌ కాస్పర్‌ రూడ్‌.. 6-3, 6-7 (5-7), 6-3, 3-6, 7-6 (10-7) మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు