Sunday, April 28, 2024

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తప్పక చదవండి
  • కొండను ఢీకొట్టిన తమిళనాడు కారు
  • ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా అదుపుతప్పిన కారు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులకు గాయాలు కాగా.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భక్తులు తమిళనాడు నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి కొండపై నుంచి బయల్దేరగా.. మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఓ ఎలక్ట్రిక్ బస్సు కూడా బోల్తాపడింది.. అయితే ఈ ఘటనల్లో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాలతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. అవసరమైన చోట ముందస్తు హెచ్చరికల బోర్డుల్ని ఏర్పాటు చేసింది. అలాగే మహా శాంతి హోమం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెద్దగా జరగలేదు.. తాజాగా జరిగిన ప్రమాదంలో కూడా భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు