Saturday, May 4, 2024

స్మశానంలో బండి సంజయ్ దీపావళి సంబురాలు..

తప్పక చదవండి
  • దళిత కుటుంబాలు ఆనవాయతీగా నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్న బండి సంజయ్
  • దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్

దీపావళి పర్వదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సందడిగా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో పలుచోట్ల రాజకీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలోని శ్మశానంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకలను జరుపుకున్నారు. వినడానికి కాస్త విడ్డురంగా ఉంది కదా.. కానీ ఇది నిజం. వాస్తవానికి ప్రతి యేటా కరీంనగర్‌లో దళిత కుటుంబాలన్నీ వ్యవసాయ మార్కెట్ సమీపంలోని స్మశానంలో దీపావళి వేడుకులు జరుపుకుంటారు. ఇక్కడి దళిత కుటుంబాల్నీ తమ తమ పెద్దల, పూర్వీకుల సమాధులను అలంకరించి, వారిని గుర్తు చేసుకుంటూ సమాధుల దగ్గర పూజలు చేస్తారు. సమాధుల ముందు దీపాలు వెలిగించి వారి ఆత్మలు శాంతించాలని స్మరించుకున్నారు. టపాసులు కాల్చి వేడుకలను జరుపుకుంటారు. సమాధుల వద్ద స్వర్గస్తులైన తమ పెద్దలు, పూర్వీకులను స్మరించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఈ వేడుకల్లో హాజరయ్యారు. పలు సమాధులవద్దకు వెళ్లి దళిత పెద్దలకు నివాళులు అర్పించారు. దళిత కుటుంబాలతో కలిసి దీపావళి సంబురాలు జరుపుకున్నారు. బండి రాకతో పెద్ద ఎత్తున దళితులు వచ్చి ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ వేడుకల కోసం అక్కడి మున్సిపల్ సిబ్బంది లైటింగ్స్, త్రాగునీటిని ఏర్పాట్లు చేశారు. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటికల శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు