Wednesday, May 15, 2024

సుమారు వంద అక్రమ వెబ్‌సైట్లు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : సుమారు వందకుపైగా అక్రమ వెబ్‌సైట్లపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకున్నది. ఆ వెబ్‌సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్‌టైం జాబ్‌ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వెబ్‌సైట్లను ఆపరేట్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ త్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌కు అనుబంధమైన ఇండియన్‌ సైబర్‌క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ ఆ అక్రమ వెబ్‌సైట్లను గుర్తంచింది. వారం క్రితం ఆ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేశారు. ఎ4అ ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర ఐటీశాఖ ఆ సైట్లను బ్లాక్‌ చేసింది. డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్లు, చాట్‌ మెసెంజర్లు, రెంట్‌ అకౌంట్ల ద్వారా ఆ వెబ్‌సైట్లకు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక నేరాల ద్వారా వస్తున్న నిధుల్ని విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. క్రెడిట్‌ కార్డులు, క్రిప్టోకరెన్సీలు, ఓవర్‌సీస్‌ ఏటీఎం విత్‌డ్రాలు, ఇంటర్నేషనల్‌ ఫిన్‌టెక్‌ కంపెనీల ద్వారా ఆ సొమ్మును తరలిస్తున్నట్లు ప్రకనటలో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు