Wednesday, May 15, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓ.. ఓటరు సోదరా..
నీ తెలివి ఎటుపోతుంది..
గొర్రెలకంటే దారుణంగా
మోసపోతున్నావు
అర్థం అవుతుందా..?
నువ్వు ఓటేస్తే
ఆ సీట్లో కూర్చునే
వాడే నీకు డబ్బులిచ్చి
నీతోనే ప్రచారం చేపించి,
నిన్నె మెజార్టీగా చూపుతూ
ప్రత్యర్థులను, నికారసైన ఓటర్లను
ప్రలోభపెడుతూ..
గద్దెనెక్కి గద్దలా సామాన్యుల
సోమ్మును దోచుకుంటున్నాడు..
నీ తెలివితేటలు ఎటుపోతున్నాయి..
భవిష్యత్తు తరాలకు నీవు ఏం
సందేశం ఇవ్వాలనుకుంటున్నావు..
ఒక్కసారి ఆలోచించు..
ఓటును అమ్ముకోకు
భవిష్యత్తు తరాలను
అందకారంలోకి పంపకు ..

  • పరుశురాం ముస్త్యాల
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు