Monday, April 29, 2024

దానం తీరే సెపరెట్‌..!

తప్పక చదవండి
  • అప్పుడు యూటీ పాట.. ఇప్పుడు ఉద్యమ పాట
  • నాడు విద్యార్థులపై లాఠీ ఎత్తిన నాయకుడు
  • నేడు టిఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్యెల్యే అభ్యర్థి
  • నిజమైన ఉద్యమకారులకు దక్కని ప్రాధాన్యత
  • ద్రోహులను అందలమెక్కించిన గులాబీ బాస్‌
  • నాగేందర్‌ తీరును చూసి.. ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
  • కాంగ్రెస్‌ వైపు చూస్తున్న ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజలు

వెయ్యి గోడ్లను తిన్న రాబందు పుణ్యం కోసం తీర్థయాత్రలకు పోయినట్లుంది బీఆర్‌ఎస్‌ బీటీ (బంగారు తెలంగాణ)బ్యాచ్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం దానం ఏనాడు పోరాటం చేసిందీ లేదు. పైగా అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న దానం నాగేందర్‌ ఉద్యమకారుల పేరు చెబితేనే శివాలెత్తిపోయేటోళ్లు. ఒకానొక సందర్భంలో లా అండ్‌ ఆర్డర్‌ తన చేతుల్లోకే తీసుకొని ఉద్యమకారులను చితకబాదేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానంకు ఉద్యమకారుల సెగ తగిలింది. ఉద్యమానికి మద్దతు పలకాలని దానంను అప్పట్లో ఉద్యమకారులు హైదరాబాద్‌ నడిబొడ్డున పలుమార్లు అడ్డగించారు. ఆయన కాన్వాయిని అడ్డుకొని, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలూ చేశారు. అయిత్ఱే ఉద్యమకారుల తీరుతో చిరెత్తిపోయిన నాగేందర్‌, వారిపై లాఠీలు రaుళిపించారు. పోలీసు లాఠీ చేతబట్టుకొని దొరికిన ప్రతీ ఉద్యమకారుడిని చితకబాదేశారు. అప్పట్లో దానం చేసిన ఈ యవ్వారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

అయితే దానం నాగేందర్‌ ఇంతటితో ఆగలేదు. అందరూ హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేస్తుంటే..ఈయన మాత్రం హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్‌ ను వినిపించారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారని.. అందువల్ల హైదరాబాద్‌ సిటీని యూటీ చేస్తేనే బాగుంటుందనే వాదన వినిపించారు. అప్పటి తన సహచర మంత్రి ముకేష్‌ ను కలుపుకొని యూటీ పాట పాడారు. అయితే నాగేందర్‌ వ్యవహారాన్ని తరవుగా గమనించిన ఉద్యమకారులు దానంపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత దానం వంటి నేతలకు గుణ పాఠం తప్పదని అప్పటి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే నాగేందర్‌ కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దానం తెలంగాణ ద్రోహీ అంటూ దుమ్మెత్తిపోశారు.

- Advertisement -

ఉద్యమ పార్టీ పేరుతో ఓట్లడుగుతున్న దానం
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు చుక్కలు చూపించిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇప్పుడు అదే ఉద్యమ పార్టీ పేరు చెప్పి ఓట్లడుగుతుండడం గమనార్హం. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో త్య్షాగాలు చేసిందని, తాను తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా మద్దతునిచ్చానని చెప్పుకుంటుండడం విశేషం. తాను ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ పార్టీలోనే ఉన్నానని, తనను ఆశీర్వదించాలని ఖైరాతాబాద్‌ ప్రజలను దానం అభ్యర్థిస్తున్నారు. తన సెగ్మెంట్‌ లిమిట్స్‌ లో ప్రచార కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పదే పదే తెలంగాణ జపం చేస్తున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌. తెలంగాణ ఉద్యమాన్ని ఓన్‌ చేసుకునే యత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా చూస్తున్న ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటుండడం గమనార్హం.

తెలంగాణ ద్రోహిగా ముద్రపడిన దానం బీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉద్యమకారుడని చెప్పుకొని ఓట్లడుగుతున్నందుకు నవ్వాలో.. ఏడ్వాలో తెల్వక తలలు పట్టుకుంటున్నారు. దానం తెలంగాణ ఉద్యమకారుడైతే.. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆయన చేసిన యవ్వారాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. నాగేందర్‌ ఉద్యమకారుడైతే మేమంతా ఎవ్వరమని స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలను అక్కడి ఓటర్లు నిలదీస్తుండడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ లోకి నాగేందర్‌ జాయినింగ్‌ నే జీర్ణించుకోలేని స్వంత పార్టీ నేతలు ఇప్పుడు తెలంగాణ వాదాన్ని తన ప్రచారంలో ఓన్‌ చేసుకునే ప్రయత్నం నాగేందర్‌ చేయడం, ఎక్కడ అధికార పార్టీకి మైనస్‌ గా మారుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు