Tuesday, May 21, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓ దొరా…
మా ఓటును మేము స్వేచ్ఛగా
వేసుకున్న చరిత్రలే లేవు..
మా కుండల బువ్వ మేము
దేవుకోని తింటున్నా మీకు
కడుపు మంటలే..
మా బత్కులు మేము బత్కుతున్నా
మీకు పంటినోప్పులే..
మా జాతంత తాకట్టుపడి
మీ పాదాలకింద
నలిగితేనే మీకు నాల్గు
మెతుకులు గొంతుదిగుతాయి..
లేదంటే కందిరీగలు
కొరికిన వాడిలనే చంచలత్వం..
ఎన్కకు తిరిగినన్ని రోజులు
వగలాడి మీద ప్రేమలే మీవీ..
ఓ దొంగ దొరా..
మిమ్మల్ని నమ్మడం కన్న..
అడవిలో సింహాన్ని నమ్మడమే
మేలు అది ఆకలైతేనే వేటాడుతది….

  • కనకమామిడి సన్నీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు