Monday, May 6, 2024

ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు..

తప్పక చదవండి
  • అత్యధిక ధర పలికిన స్టార్క్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ ప్రయత్నం చేసింది. కానీ చివరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. అంతకుముందు.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 20.50 కోట్ల భారీ ధర పలికాడు. ఇప్పుడు ఆ ధరను స్టార్క్‌ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌.. గత 8 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో ఆడలేదు. అయితే.. 2023 వరల్డ్‌ కప్‌ లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఫైనల్‌ లో జట్టు విజయం కోసం కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. స్టార్క్‌ మునుపు ఉన్న ఫామ్‌ కంటే, ఇప్పుడు చాలా బెటర్‌ గా ఉన్నారు. ఈ క్రమంలో అతను ఈ ఐపీఎల్‌ లో.. రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో అతని పేరు రాగానే.. స్టార్క్‌ ను సొంతం చేసుకోవడానికి ఢల్లీి క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ పెద్ద మొత్తంలో వేలం వేసింది. ఆ తర్వాత ఆ ఫ్రాంఛైజీలు తప్పుకోవడంతో.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ వేలంలోకి వచ్చాయి. ఈ రెండు ఫ్రాంఛైజీల మధ్య నువ్వా నేనా అన్నట్లు కొనసాగింది. చివరకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. పాట్‌ కమిన్స్‌ రూ. 20.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టి, మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ. 24.75 కోట్లు చెల్లించి తమ జట్టులోకి చేర్చుకుంది. మిచెల్‌ స్టార్క్‌ తన చివరి ఐపీఎల్‌ 2015లో ఆడాడు. ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్‌ హ్యాండ్‌ ఫాస్ట్‌ స్వింగ్‌ బౌలర్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. అతను 20.38 సగటుతో మరియు 7.17 ఎకానమీ రేటుతో మొత్తం 34 వికెట్లు తీశాడు. అయితే.. ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున మిచెల్‌ స్టార్క్‌ ఎలా బౌలింగ్‌ చేస్తాడో చూడాలి మరీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు