Saturday, April 27, 2024

ఇరిగేషన్‌ శాఖలో భారీ స్కాం

తప్పక చదవండి
  • రూ. 94 వేల కోట్లు ఖర్చు చేసి ఎవ్వరికి నీరిచ్చారు
  • 18వేల కోట్లు ఇంట్రెస్ట్‌లు, 9వేల కోట్లు అప్పులు
  • అన్పైడ్‌ బిల్ల్స్‌ ఇరిగేషన్‌లో భారం..
  • రాష్ట్రానికి చుక్క నీళ్లు తీసుకురాలేదు..
  • బీఆర్‌ఎస్‌ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే
  • కృష్ణా గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
  • నిబంధనలు పాటించని అధికారుల పై చర్యలుంటాయి
  • నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సమీక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామని పేర్కొన్నారు. తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్‌ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయానని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్‌ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నీటి వాటాలో ఒక చుక్క ఎక్కువ తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరైన ఫార్మేట్‌లో అప్లై చేయలేదని అన్నారు. జాతీయ హోదా అనే అం శం రాజకీయాల కోసం బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడారని, జాతీయ హోదా అనేది దేశంలో ఎక్కడా లేదని కేం ద్ర జలశక్తి మం త్రి తేల్చి చెప్పిన విషయాన్నీ ఉత్తమ్‌ ప్రస్తావించారు.. జాతీయ హోదా కాకుండా ఇతర మార్గాల్లో 60 శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడు జాతీయ హోదా గురించి మాట్లాడటానికి హరీష్‌కు సిగ్గూ శరం ఉండాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు .

18వేల కోట్లు ఇంట్రెస్ట్‌ లు, 9వేల కోట్లు అప్పులు
కేఆర్‌ఎంబీకి ఏ ప్రాజెక్టు అప్పగించడానికి మేము ఒప్పు కోలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయం చేయను
అంటూనే హరీశ్‌ రాజకీయాలు మాట్లాడాడని ఉత్తమ్‌ ఫైర్‌ అయ్యారు. కేఆర్‌ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అందివ్వలేదన్నారు. కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపిందని ఉత్తమ్‌ అన్నారు. దీనిపై తెలంగాణ ఎలాంటి సమాధానం చెప్పలేదని, మేము కేంద్రం చెప్పిందానికి అం గీకారాన్ని తెలుపలేదన్నారు. కృష్ణ వాటర్‌ గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కి ఉందా? అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. మీరు జగన్మోహన్‌తో అలైబలై తీసుకున్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా జగన్‌ కృష్ణా నీటిని తీసుకు వెళ్తున్న ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆరోపించారు. హైదరాబాద్లో గంటలు గంటలు జగన్మోహన్‌ రెడ్డితో మీరు ఏకాంత చర్చలు జరిపారు. తెలంగాణ సంపద 2 లక్షల కోట్లు సంపద దోపిడీకి, అన్యాయానికి గురైంది. కేసీఆర్‌ 10.5, 11%కు కార్పొరేషన్‌ లోన్లు తీసుకువచ్చారు. బీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిన అప్పులకు రీపెమెంట్‌, ఇంట్రెస్ట్‌ తో కలుపుకుని 18 వేల కోట్లు అవుతుందని ఉత్తమ్‌ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు