Thursday, May 2, 2024

నగర శివారులో భారీగా గంజాయి పట్టివేత

తప్పక చదవండి
  • తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసుల ముమ్మర తనిఖీలు
  • పోలీసుల అదుపులో (8) మంది రవాణాదారులు
  • రూ. 7 లక్షల 50 వేల విలువైన గంజాయి

హైదరాబాద్‌ శివారులో భారీగా గంజాయి పట్టుబడిరది. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ట్రావెల్స్‌ బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించిన 30 కేజీల గంజాయిని గుర్తించిన అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి, డ్రగ్స్‌ నివారణకై హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌, డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ పర్యవేక్షణలో సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి.రవీందర్‌ రావు ఇంకా ఎఇఎస్‌ బి. హనుమంత రావు నేతృత్వంలో గురువారం తెల్లారుజామున 3 గంటల నుంచి అబ్దుల్లాపూర్‌ మెట్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీ ఆవరణలో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని ప్రైవేట్‌, ఆర్టీసీ ఇతర వాహనాల రాకపోకలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి (8) మంది ప్రయాణీకుల నుంచి సుమారుగా (24) కేజీల గంజాయిని స్వాదీనం చేసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరూర్‌ నగర్‌ ఎక్సైజ్‌ సూపింటెండెంట్‌ తెలిపారు. దీని విలువ సుమారుగా 7లక్షలు ఉంటుందని వివరించారు. ఆంధ్రలోని విశాఖ జిల్లా, పలాస, రాజమండ్రి, నర్సీపట్నం, అరకు, ఒడిశాలోని మల్కన్‌ గిరి నుంచి ఢల్లీి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పట్టుబడిన యువకులు తమ విచారణలో వెల్లడిరచారని, వీరు ఈ పని చేయడం వల్ల పది వేల రూపాయల వరకు కమిషన్‌ లబిస్తుందని హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ ఇన్స్పెక్టర్‌ టి. లక్ష్మణ్‌ గౌడ్‌ తెలిపారు. ఈ యువత ఇలాంటి అక్రమ కేసుల్లో చిక్కుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఈ లింక్‌ ను అరికట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ నిరంతర చర్యలు చేపట్టిందని, ఇలాంటి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సరూర్‌ నగర్‌ డిటిఎఫ్‌ సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ లు వెంకన్న, జి.హనుమంతు, జి.సరళ, ఎండీ పాష, ఎల్‌.హనుమంతు సరూర్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు