Friday, May 3, 2024

సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు

తప్పక చదవండి
  • మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది
  • ప్రయాణం ఉచితం కావడంతో పెరిగిన రద్దీ
  • ప్రయాణికుల అవసరం మేరకు బస్సుల కేటాయింపు
  • ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంటే ఆర్టీసీ కి తిరుగులేదు
  • గత ప్రభుత్వం లాగా మాటలకే పరిమితమైతే మాత్రం
  • ఆర్టీసీని తెలంగాణ ప్రజలు మరిచిపోవాల్సిందే..

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండవరోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసింది.. దీంతో ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరిగింది. అయితే ప్రతీ ఏడు పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడం సంప్రదాయంగా వస్తోంది.. కానీ ఈ సారి మహిళకు ఆర్టీసీ ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితం చేయడంతో గతం కంటే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటూ అధికారులు భావిస్తున్నారు.అందుచేత రద్దీ అవసరం దృష్ట్యా పలు రూట్లలో గతం కంటే ఎక్కువ బస్సులు ఆర్టీసీ నడపునుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అవసరం మేరకు జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనున్నట్లు ఆదికారులు చెబుతున్నారు. .

మహిళలకు ఉచిత ప్రయాణం
మహిళలకు ఉచిత ప్రయాణంలో ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందా అని కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనిపై కూడా ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సంక్రాంతికి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులకు సంబంధించి ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు.అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

రద్దీ ఉండే మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-ఎండీ సజ్జనార్
సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఉండే మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు . ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్, అరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని అన్నారు . ప్రయాణికలు రద్దీని బట్టి స్టాప్ ల వద్ద తాగు నీరు, కూర్చీలు, మొబైల్ టాయిలెట్స్, టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ స్టాప్ ల వద్ద ఇద్దరు డీవీఎం స్థాయి అధికారులను నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు . వారు ప్రత్యేక బస్సుల గురించి ప్రయాణికులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. బస్ టికెట్ల ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు టీఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.

నగర ప్రజలకు అంతరాయం లేకుండా చేస్తున్నాం – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు
సంక్రాతి పండుగవేలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు వారి వెళ్లే గమ్యస్థానాలకు భద్రంగా చేరుకోవడానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నగరం నుంచి 500 బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచద్దాం జరిగిందని ఆయన అన్నారు. సాధారణ సమయాల్లో నగరంలో 2700 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని.. విద్యాసంస్థలకు,పలు కంపనీలకు సంక్రాతి పండుగ వచ్చిన నేపథ్యంలో వస్తున్న సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ తక్కువ ఉంటుందని .. అందుకే పలు రూట్లలో గతం కంటే తక్కువ బస్సులు నడుస్తాయని కొన్ని రూట్లలో బస్సుల సంఖ్యని కుదించడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో సాధారణంగా రోజుకు 9 లక్షల ప్రయాణికులు ప్రయాణించేవారని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా 11 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.. గతంలో రోజు వారి ఆద్యం 3 కోట్లు ఉంటె ఇప్పుడు 5 కోట్లకు పైగా చేరుకుందని అన్నారు..

బస్సుల్లో పెరిగిన దొంగతనాలు..
ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ కారణంగా ఎవ్వరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని పరిస్థితి ఏర్పడిందని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రయాణికులు తమతో తీసుకుపోతున్న వస్తువులను, ధరించిన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలని వారు కోరారు. కొందరు దొంగతనం కోసం ప్రయాణికుల మాదిరిగా ప్రయాణం చేస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారని వారి నుండి జాగ్రత్తగా తమ వస్తువులను కాపాడుకోవాలని సూచించారు. తమ పరిధిలోని డ్రైవర్లకు, కండక్టర్లకు ఎప్పటికప్పుడు ఈ విషయాలను అవగాహన కల్పించడం జరుగుతుందని ఈడీ పేర్కొన్నారు. ప్రయాణికులు ఆందోళనతో కాకుండా సురక్షితమైన ప్రయాణం చేసి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు