- హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కాలేదు
- వరి కనీస మద్దతు ధర రూ.3100 ఇస్తాం
- మానకొండూరులో ఎవరెన్ని నిధులిచ్చారో చర్చకు సిద్ధమా?
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
- ఆరెపల్లి మోహన్ తో కలిసి రోడ్ షో నిర్వహించిన సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఏటా 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు కనీస మద్ధతు ధరను ఏకంగా రూ.3100లు చెల్లిస్తామని ప్రకటించారు. మానకొండూరు బీజేపీ అభ్యర్ధి ఆరెపల్లి మోహన్ తో కలిసి బెజ్జంకిలో నిర్వహించిన రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
మీరు కేసీఆర్ కు ఓట్లేసి గెలిపిస్తే చేసిందేమిటి? తాగి పండుకోవడం తప్ప? దేశమంతా ఇండ్ల మంజూరు చేస్తున్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు 2.4లక్షల ఇండ్లకు నిధులిస్తే వాటిని దారి మళ్లించిన కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా మీకు ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే ఎందుకు సీఎంను అడగలేదు? 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలే. నిరుద్యోగ భ్రుతి ఇవ్వలే. ఎందుకు నిలదీయలేదు.. దళిత బంధు, బీసీ బంధు పథకం ఎందుకు ఇవ్వలేదు.. దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్ ను ఎమ్మెల్యేలే తీసుకుంటున్నారని కేసీఆరే స్వయంగా చెప్పిండు కదా.. అయినా ఎందుకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అందులో కేసీఆర్ కు వాటా పంపిస్తున్నారు. పేదలందరికీ రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోంది మోదీ ప్రభుత్వమే… మరో ఐదేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వబోతున్నారు. అంతేగాదు.. బీజేపీ అధికారంలోకి వస్తే వరికి కనీస మద్దతు క్వింటాలుకు రూ.3100 ఇస్తాం.
ఆరేపల్లి మోహన్ పక్కా లోకల్. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. నిజాయితీపరుడు. వారిద్దరూ నాన్ లోకల్. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎట్లాంటోడో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తది.. కేసీఆర్ వన్నీ అబద్దాలే.. మోటార్లకు మీటర్లు పెట్టాలనుకున్నది కేసీఆరే. మేం వార్నింగ్ ఇస్తే వెనుకడుగు వేశారు.. మళ్లీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం…ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఇచ్చే 6 గ్యారంటీలకు విలువ లేదు. ఢిల్లీలో, గల్లీలో అధికారం లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలకు గ్యారంటీ ఏమిటి? రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే ఏటా 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. దేశానికి అన్నం పెట్టే రైతును ఆదుకునేందుకు వరికి కనీస మద్దతు ధర రూ.3100లుగా చెల్లిస్తాం…బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నా..