సంగారెడ్డి : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ముంబై-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై చెరాగ్‌పల్లి శివారులో ఏర్పాటుచేసిన మాడ్గి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ కారులో తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4 కోట్ల 55 లక్షలు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని చెప్పారు.
తప్పక చదవండి
-Advertisement-