Friday, May 3, 2024

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్‌

తప్పక చదవండి
  • ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ
  • చంద్రబాబు , సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శల దాడి
  • ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ
  • రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ
  • వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం
  • అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు , సీఎం జగన్‌ పై విమర్శల దాడికి దిగారు. ఇద్దరు కలిసి ఏపీని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికి దక్కుతుందని.. టీడీపీ , వైసీపీ ,బీజేపీకి మద్దతుదారులని ఫైర్‌ అయ్యారు. అధ్యక్ష పదవీ స్వీకారణ అనంతరం షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ఆమె చర్చించారు.
అన్ని స్థానాల్లో పోటీ..
రాబోయే ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో అలాగే పార్లమెంట్‌ ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని తెలిపారు షర్మిల. 23 నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుందని వెల్లడిరచారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. 24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము అన్నారు.
దేశానికీ బీజేపీ అవసరం లేదు..
మణిపూర్‌ లో జరిగిన సంఘటనలు వలన దేశానికి బీజేపీ అవసరం లేదని అన్నారు షర్మిల. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్‌ స్టిల్‌ ప్లాంట్‌ లాంటి అన్ని విషయాల్లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఫైర్‌ అయ్యారు. వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ వల్లే అని పేర్కొన్నారు.
అప్పుడే ఏపీకీ ప్రత్యేకహోదా..
గత పదేళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ, టీడీపీ పార్టీలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు షర్మిల. రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్లు షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనకు ముఖ్యం అని అన్నారు. తాను ఎవరు వదిలిన బాణం కాదు అని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఒక నియంతనుఓడించా..
మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడద్దు అని హెచ్చరించారు షర్మిల. అలా అనుకుంటే తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించానని కేసీఆర్‌ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తనకు ఆంధ్ర ప్రదేశ్‌ పుట్టిన ఇల్లు.. తెలంగాణ మెట్టిన ఇళ్ళు అని అన్నారు. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపిందని అన్నారు.
నా స్వార్ధం చూసుకోలేదు..
నేను నా స్వార్ధం చూసుకోలేదని షర్మిల పేర్కొన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. రీజనల్‌ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోందని అన్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు