Tuesday, April 30, 2024

ఇది సారు.. కారు.. 60 పర్సంట్ సర్కార్..

తప్పక చదవండి
  • దళిత బంధులో 30 శాతం ఎమ్మెల్యేలకు, మరో 30 శాతం సీఎం కుటుంబానికి
  • కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రియల్ దందాలన్నింట్లో 60 శాతం కమీషన్లు
  • అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు… అవినీతి సర్కార్
  • ట్రిపుల్ వన్, కోకాపేట భూములను బీఆర్ఎస్ కు కేటాయింపుపై కోర్టుకు వెళతాం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టీకరణ
  • రాష్ట్రానికి ప్రధాన విలన్ కేసీఆరేనంటూ ఉద్ఘాటన

హైదరాబాద్ : ‘‘దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే… మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు – కారు- 60 పర్సంట్ సర్కార్’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సాయంత్రం బండి సంజయ్ మాట్లాడారు. సారు- కారు- 6‌0 పర్సంట్ సర్కార్ ను ఇంటికి సాగనంపేదాకా పోరాడతామని స్పష్టం చేశారు. ట్రిపుల్ వన్ జీవో పై మహా కుట్ర, కోకాపేట భూముల కేటాయింపు వెనుక కుట్ర ఉందని, దీనిపై లీగల్ సెల్ ద్వారా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాన విలన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘‘తెలంగాణ ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే. అల్లు రామలింగయ్య లాగా కాంగ్రెస్ పార్టీ సైడ్ విలన్ పాత్ర పోషిస్తే, కైకాల సత్యనారాయణ పాత్రను ఎంఐఎం, సూది దబ్బడం పార్టీలు పోషిస్తున్నాయని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలను ఎదుర్కొనేందుకు బీజేపీ హీరో పాత్ర పోషిస్తోందని. కేసీఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణకు విముక్తి కల్పించి పేదల రాజ్యాన్ని స్థాపిస్తామని ఉద్ఘాటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు