Friday, March 29, 2024

భారతీయులను అక్కున చేర్చుకున్నారు

తప్పక చదవండి
  • సిడ్నీలో ప్రవాస భారతీయులతో సమావేశం
  • ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానన్న తన వాగ్దానం నిలుపుకున్నానని మోదీ వెల్లడి
  • క్రికెట్, కర్రీ, కామన్‌వెల్త్.. భారత్ – ఆస్ట్రేలియాలను కలిపి వుంచుతాయి
  • ఇప్పుడది ‘3డీ’గా మారిందని వివరణ

ఆస్ట్రేలియా : భారత్ ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్‌వెల్త్, క్రికెట్, కర్రీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంగళవారం సిడ్నీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు మళ్లీ వస్తానని 2014లోనే మీకు వాగ్దానం చేశాను… మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చి నా వాగ్దానం నిలబెట్టుకున్నా అని వెల్లడించారు. అంతేకాదు, భారత్, ఆస్ట్రేలియా దేశాలను యోగా, సినిమాలు కూడా కలిపి ఉంచుతాయని వివరించారు. ఆస్ట్రేలియా ప్రజలు మంచివారు, విశాల హృదయులు అని ప్రధాని మోదీ కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య వలసల ఒప్పందం జరిగిందని.. బ్రిస్బేన్‌లో త్వరలోనే భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఆపద వున్న భారత్ స్పందిస్తోందని.. అందుకే ప్రస్తుతం భారత్‌ను విశ్వగురు అంటున్నారని మోడీ పేర్కొన్నారు. వలసల ఒప్పందం వల్ల ఇరుదేశాల విద్యార్ధులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కరోనా సమయంలో భారత్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందని మోడీ గుర్తుచేశారు. తనతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. “భారతీయులను ఆస్ట్రేలియా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ భాషలన్నీ వినిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అనేక ప్రాంతాలు భారతీయులకు ప్రత్యేకమైనవి. ముఖ్యమైన భారతీయ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయి. సిడ్నీలోని ప్రపంచ ప్రఖ్యాత ఓపెరా హౌస్ పై భారత జెండా కనిపించడం సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియా స్థాయిలో భారత్ కూడా త్వరగా అభివృద్ధిని అందుకోవాలి. మొబైల్ వినియోగంలో భారత్ నెంబర్ వన్ గా ఉంది. ఫిన్ టెక్ రంగంలోనూ భారతదేశమే అగ్రగామి. పాల ఉత్పత్తి రంగంలోనూ భారత్ కు తిరుగులేదు” అని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు