Thursday, May 16, 2024

special feature

ఆజ్ కి బాత్..

రాజకీయం అంటేనే పద్మవ్యూహం..అందులో అభిమన్యుడులాంటివాళ్ళు పనికిరారు.కృష్ణుడు లాంటివాడే వుండాలి.చక్రం తిప్పటానికి..మాయ చెయ్యటానికి..ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో ఎవరు అభిమన్యుడు..ఎవరు శ్రీ కృష్ణుడు..? కాలమే నిర్ణయించాలి.. అల్లి ప్రవీణ్

ఆజ్ కి బాత్..

కల సాకారం కోసం కొవ్వొత్తిలా కాలుతున్నం..కన్నవాళ్ళు ఆశలను సజీవ సమాధి చేస్తున్నం..ఓ మహాత్ముడు చెప్పినట్లు..స్వార్ధరాజకీయాల్లో మేము పావులం..మీ బ్రతుకులకు మా బతుకులు ఆగమాగం..సిద్దించిన గడ్డ కోసం మా త్యాగాలు వృధా పోవు..ఎవడైతే మన శ్వాసాలను పణంగా పెట్టి ఊరేగుతున్నాడో..వాడు మనల్ని తలుచుకునేలా చేసినప్పుడేమన ఉద్యమ త్యాగనిరతి వెలుగు చూస్తుంది.. మైలా సత్యనారాయణ..

ఆజ్ కి బాత్..

దేన్నైనా మోయడం దుఃఖమేకదా..నాలోని అవస్థ నన్ను కౌగలించుకుని,దుఃఖపు గ్లుసుల్ని పెనవేస్తూ ఉంటే..నగరం నిద్రలో ఊగిసలాడుతోంది..చివరి నిద్ర నన్ను తరుముకుంటూ, తవ్వుకుంటూ..నా గుండెల మీద పిడిబాకుల కవాతు చేస్తున్నట్లుంది..నాకే అర్ధం కానీ మరేదో బాధ..నన్ను శూన్యంలోకి విసిరేస్తోంది..దుఃఖాన్ని దిగమింగుతూ..ఈ మట్టిపొరల క్రింద నా ఊపిరి ఇంకానవ్వుతోంది.. ఎదో జరగాల్సి వుంది..మరోలా నేను లేవాలని నా మనసుఆరాట...

ఆజ్ కి బాత్..

వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..రతనాల గుండెలు బాదుకోబట్టే..అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలుచెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాంఅని ఒక్కసారి కూడా అనుకోరా..? రైతన్నలారా..ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే..అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు రూ. 10,000ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా..చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకుపది...

ఆజ్ కి బాత్..

వానాకాలం సీజన్ దాటిపోతుంది..రైతులను కరువు చీకట్లు కమ్ము కుంటున్నయి..విత్తులు నాటి ఆకాశం వైపు చూస్తున్నారు..చినుకు పడదు.. విత్తు మొలకెత్తదు..అతివృష్టి, అనావృష్టులు రైతులను ముంచుతున్నయి..సేవ పేరుతో నేతలై స్వార్థం కోసం ఏడ్చే కండ్లుమురికి గుంటల కన్న హీనం..తుదకు.. మురికి నీరైనా కాలే మంటలను ఆర్పగలవు..నేతల స్వార్థ పూరిత కన్నీటి నటన కాదు?అన్నం పెట్టే రైతున్నల ఆత్మహత్యలు...

ఆజ్ కి బాత్..

గంజాయి బంజేయ్యి ఓ బిడ్డనా గుండె బరువైతందిరా నా బిడ్డ…కారం మెతుకులు తిని కడుపునింపుకొనినిన్ను కన్నానురా ఓ బిడ్డ..నా నెత్తురు కరిగించి చనుభాలలోపాలబోట్లయి నీ ఆకలి తీర్చినరా ఓ బిడ్డ..మాయదారి మత్తులో పడి మట్టిలోకలిసిపోకు రా నా బిడ్డ..దేశానికీ ఓ సైనికున్ని చేస్తా అనికలలు కన్నా ఓ బిడ్డ..పచ్చని గ్రామాల్లోకి గంజాయి డ్రగ్స్దాపురించి దహించి...

ఆజ్ కి బాత్..

పంట నష్టం రాసుకుని పోయి 2 నెలలాయే..ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే..ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్పరైతుకు రూపాయి రాలే..రైతు రుణమాఫీ జాడనేలేదు..బ్యాంకులోనూ మాఫీ ఐతయని లక్షతీసుకుంటే మిత్తి కలిపి 2 లక్షలు ఐనై..ప్రభుత్వం చెప్పే మాయమాటలునమ్మి మోసపోయేవాడు రైతు ఒక్కడే..జై జవాన్.. జై కిసాన్.. అరుణ్ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్..

నిత్యవసరాలు, కూరగాయల ధరలునింగినంటుతున్నాయి..ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..మండుతున్న ధరల్లో మారుతున్నాయిసామాన్యుల బ్రతుకులు..పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలుమానండి.. సేవ చేద్దాం అని వచ్చిపన్నుల పోటుతో చావగొట్టబడితిరి..ఆకలినైనా భరించగలం.. కానీఅవమానాన్ని భరించలేం..ఆత్మాభిమానం దెబ్బతింటేపగబడతరు.. పడగొడుతరు సుమా.. !- మేదాజీ

హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మహా మాయ..( రూ. 100 కోట్ల ఋణం కోసం పెద్ద ఎత్తున మోసం..)

బూర్గు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వాకం.. హైదరాబాద్ స్టాక్ ఎక్చేంజి సోమాజిగూడ బిల్డింగ్ ని BIPPL వారికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ బిల్డింగ్ షేర్ హోల్డర్స్ ప్రమేయం లేకుండా ఎస్.బీ.ఐ.కి మార్టిగేజ్ చేసిన బూర్గు రవికుమార్, కె. శివకుమార్ లు.. మార్టిగేజ్ చేయాలంటే కనీసం 76 శాతం షేర్ హోల్డర్స్ స్పెషల్ రెజుల్యేషన్ పాస్ చెయ్యాలి.. ఎలాంటి సరైన...

ఆజ్ కి బాత్..

సూడు సూడరో మన తెలంగాణబంగారు తెలంగాణ అయిందంట..రైతుల సావులు లేవంట…సర్పంచ్ ల సావులు లేవంట..నిరుద్యోగుల సావులు లేవంట..ఉద్యోగుల భాదలు లేవంట..మన ముఖ్యమంత్రి కుటుంబంగదే బై బంగారు కుటుంబం..పదే పదే చెప్తున్న పుకట్ మాటలంట…ఈ సారి ప్రజలు మాత్రం ఇనరంట..తెలంగాణల మార్పు సాధ్యం అంట..ఇది ప్రజలంతా అనుకుంటున్న మాట.. నరేష్ యాదవ్..
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -