గంజాయి బంజేయ్యి ఓ బిడ్డ
నా గుండె బరువైతందిరా నా బిడ్డ…
కారం మెతుకులు తిని కడుపునింపుకొని
నిన్ను కన్నానురా ఓ బిడ్డ..
నా నెత్తురు కరిగించి చనుభాలలో
పాలబోట్లయి నీ ఆకలి తీర్చినరా ఓ బిడ్డ..
మాయదారి మత్తులో పడి మట్టిలో
కలిసిపోకు రా నా బిడ్డ..
దేశానికీ ఓ సైనికున్ని చేస్తా అని
కలలు కన్నా ఓ బిడ్డ..
పచ్చని గ్రామాల్లోకి గంజాయి డ్రగ్స్
దాపురించి దహించి వేస్తున్నవిరా దేవుడా..
మాట వినుర నా బిడ్డ మత్తు వదలరా నా కొడుకా..
- ఓ గ్రామీణ తల్లి ఆవేదన..