Friday, April 26, 2024

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంకా డెవలప్ చేయాలి..

తప్పక చదవండి
  • మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ వ్యాఖ్యలు..
  • భవిష్యత్ లో ఏఐ గూగుల్, అమెజాన్ లను చంపేస్తుంది..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మైక్రోసాఫ్ట్ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ గుగూల్, అమెజాన్‌లను సులభంగా చంపేస్తుందన్నారు. యూజర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుందని..అతనికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అందిస్తుందన్నారు. దీని కారణంగా ప్రజలు మళ్లీ సెర్చ్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. అయితే వినియోగదారునికి టెక్ కంపెనీలైన సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటివి కూడా వర్చువల్ అసిస్టెంట్‌లను అందిస్తాయి. అయితే వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ లాంటి విధానం లేకపోవడం గమనార్హం అన్నారు. చాట్ జీపీటీ, బర్డ్, బింగ్ తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, చాట్‌బాట్‌లు యూజర్లకు వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తాయన్నారు. అయితే ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నామని…భవిష్యత్ లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గుగూల్, అమెజాన్‌ లను చంపేస్తుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్‌ మ్యాన్ సాచ్స్, ఎస్వీ ఏంజెల్ ఈవెంట్‌ బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వ్యక్తిగత సహాయకుడిగా పొందడం పెద్ద విషయమని..అలాంటి వారు మళ్లీ గుగూల్, అమెజాన్ వైపు వెళ్లరని చెప్పారు. అయితే ఏఐ వినియోగదారుల అవసరాలు, అలవాట్లను కూడా అర్థం చేసుకోగలిగే విధంగా డెవలప్ చేయాలన్నారు. చదవడానికి సమయం లేని అంశాలను కూడా చదవగలిగే స్థాయికి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే, ఏఐ అసిస్టెంట్ యొక్క గేట్స్ వెర్షన్ ఐరన్ మ్యాన్ నుండి టోనీ స్టార్క్ యొక్క జార్విస్ లాగా ఉంటుందని చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఈ సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కు జోడించగలదని ఆశిస్తున్నట్లు గేట్స్ అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ఏఐ ను డెవలప్ చేయకపోతే తాను నిరాశ చెందుతానని పేర్కొన్నారు. అయితే ఇన్‌ఫ్లెక్షన్‌తో సహా కొన్ని స్టార్టప్‌లు తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇన్‌ఫ్లెక్షన్‌ వంటి స్టార్టప్ లు ఏఐతో కమ్యూనికేట్ చేసే విధానాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ యొక్క ప్రయోజనాల గురించి బిల్ గేట్స్ వివరించారు. ఏఐ అంతరిక్షంలో ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందన్నారు. అధునాతన ఔషధ అభివృద్ధికి ఏఐ ద్వారా ముందడుగు వేయవచ్చని పేర్కొన్నారు. అల్జీమర్స్ వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగకరమైన మందులను రూపొందించడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు