Friday, April 19, 2024

ఇస్రో ‘ఎన్‌వీఎస్‌–01’ ప్రయోగం..

తప్పక చదవండి
  • ఈనెల 29 న ముహూర్తం ఖరారు..
  • 2,232 కిలోగ్రాముల బరువున్న ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌..
  • ప్రయోగం విజయవంతమైతే 12 ఏళ్లపాటు సేవలు అందించనున్న ఎన్‌వీఎస్‌–01..

అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయెగానికి సిద్దమైంది. 2023 మే 29న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10:42 గంటలకు ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనుంది. 2,232 కిలోగ్రాముల బరువున్న ఎన్‌విఎస్-01 నావిగేషన్ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి పంపేందుకు ఈ మిషన్ ను రూపొందించబడింది. నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌ (నావిక్‌) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌–01 మొదటిది. నావిక్‌ అనేది అమెరికాకు చెందిన జీపీఎస్‌ తరహాలోనే భారత్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్‌ వ్యవస్థ. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎన్‌వీఎస్‌–01.. రోదసీలో 12ఏళ్లపాటు సేవలందించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు