Friday, March 29, 2024

వయసు 98.. రోజుకు 7 గంటలు పని..

తప్పక చదవండి
  • అద్భుతాలు చేస్తున్న వృద్ధుడు..
  • నేటి యువతకు ఆదర్శంగా చికాగోకు చెందిన జో గ్రియర్ అనే వ్యక్తి..

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సోషల్ మీడియా వచ్చాక ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ఈ రోజుల్లో చాలా మంది సెలవు వచ్చిన నెక్స్ట్ రోజు ఆఫీసుకు వెళ్లాలంటే చిరాగ్గా భావిస్తారు. మళ్లీ సెలవు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 98ఏళ్ల వయసులోనూ వారానికి ఏడు రోజులు పనిచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

చికాగోకు చెందిన జో గ్రియర్ అనే వ్యక్తి ఇటీవలే తన 98వ పుట్టినరోజును జరుపుకున్నారు. దేశంలోని అత్యంత పురాతన పూర్తి-కాల ఉద్యోగులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్రియర్.. చికాగోలో ఉన్న ఒక ఉత్పాదక సంస్థ అయిన విక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ అతను ట్రోఫీలు, అవార్డుల అచ్చులను రూపొందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా అతని స్టోరీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలా మంది అతని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఫాక్స్ 32తో జరిగిన ఓ ముఖాముఖిలో పాల్గొన్న గ్రియర్.. తన సంతోషాన్ని, పని పట్ల ఆయనకు ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన పనిని ఓ హ్యాబిట్ గా అలవర్చుకున్నానని, తనకు పని ఓ అలవాటుగా మారిపోయిందని ఈ సందర్భంగా చెప్పారు. గ్రియర్ తన అచంచలమైన అంకితభావానికి విక్టరీ ప్రెసిడెంట్ ఎరిక్ ప్రైస్‌మాన్ మెచ్చుకున్నారు. సంవత్సరాలుగా కంపెనీకి అనేక సేవలందించిన అతన్ని ఆయన విలువైన సలహాదారుగా అభివర్ణించారు. కోవిడ్ -19 మహమ్మారి ఎదుర్కొంటున్న సమయంలోనూ గ్రియర్ కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి విక్టరీ ప్లాంట్‌ను సందర్శించడాన్ని కొనసాగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు