మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఆదాయ వివరాలను వెల్లడించారు. సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ ఆ వివరాలను ప్రకటించింది. గడిచిన ఆరు ఏళ్లలో పుతిన్ సుమారు పది లక్షల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సీఈసీ పేర్కొన్నది. పుతిన్ సుమారు 67.6 మిలియన్ల రూబెల్స్ లేదా 753,000 డాలర్స్ ఆర్జించినట్లు తెలిపింది. 2018 నుంచి 2024 సంవత్సరం వరకు ఆ ఆదాయాన్ని సంపాదించారు. మార్చిలో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో పుతిన్ ఆదాయ వివరాలు ఉన్నాయి.
గత ఆరేళ్లుగా జీతం, సెక్యూర్టీస్, బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ, సివిల్ పెన్షన్ నుంచి పుతిన్ తన ఆదాయాన్ని ఆర్జించారు. దీంట్లో ప్రాపర్టీ అమ్మకాల ఆదాయం కూడా ఉన్నది. పుతిన్ పేరిట కొన్ని కట్టడాలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆయనకు 77 చదరపు మీటర్ల అపార్ట్‌మెంట్, 18 చదరపు మీటర్ల గరాజ్ ఉన్నాయి. మాస్కోలో 153.7 చదరపు మీటర్ల బిల్డింగ్ ఉన్నది. దీన్ని ప్రభుత్వానికి లీజుకు ఇచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆయనకు ఓ పార్కింగ్ స్పాట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పుతిన్ వద్ద రెండు గాజ్ ఎం-21 కార్లు ఉన్నట్లు డాక్యుమెంట్ ద్వారా తెలిసింది. 1960, 1965 సంవత్సరాల్లో ఆ కార్లను ఉత్పత్తి చేశారు. 1987 నాటి ప్రచార రథం, 2009లో కొన్న లడా నివ్ కారు కూడా ఉంది. పుతిన్ తన సేవింగ్స్ వివరాలను కూడా వెల్లడించారు. సుమారు పది బ్యాంకు అకౌంట్లలో ఆయన ఆరు లక్షల డాలర్లు దాచుకున్నట్లు తెలుస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ బ్యాంకులో 230 షేర్లు ఉన్నాయి. ఒక్కొక్క షేర్ విలువ 280 రూబెల్స్.
మార్చి 15 నుంచి 17 మధ్య దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే అయిదోసారి కూడా పుతిన్ అధ్యక్ష రేసులో నెగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తప్పక చదవండి
-Advertisement-