Tuesday, July 16, 2024

ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

తప్పక చదవండి
  • ఫిబ్రవరి 8న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు
  • కేసులతో సమతమతవుతోన్న మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్
  • అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో శిక్ష ఖరారు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో కేసులో ఆయనకు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష ఖరారుచేసింది. ఇమ్రాన్ సహా మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఈ శిక్షను విధించింది. రహస్య పత్రాల లీక్ కేసులో ఈ శిక్ష విధించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించాలని అమెరికా కోరుకుందని, తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అందుకు ఇదే ఆధారం అని రహస్య లేఖను చూపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసునే సైఫర్ కేసు అంటారు. ఈ కేసు విచారించడానికి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఆ కోర్టు కేసు విచారించింది. తాజాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అబుల్ హస్నత్ జుల్కార్నెయిన్ ఈ తీర్పును వెలువరించారు. ఈ విచారణలో ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పీపీసీలోని సెక్షన్ 342 కింద ప్రశ్నావళిని అందించారు. ఇమ్రాన్ ఖాన్ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ సైఫర్ ఎక్కడ ఉన్నదని న్యాయమూర్తి అడిగారు. దీనికి ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇస్తూ.. ‘నా స్టేట్‌మెంట్‌లో సమాధానం ఇచ్చాను. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. సైఫర్ నా ఆఫీసులో ఉండేది’ అని వివరించారు. ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడింది. ప్రభుత్వం అన్ని విధాలుగా దాడి చేస్తుండగా.. ఆ ఎన్నికల్లో ఎలక్టోరల్ సింబల్ లేకుండానే పీటీఐ పోటీ చేస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలిన రెండో కేసు ఇది. గతంలో తోషిఖానా కేసులో ఆగస్టు 5వ తేదీన దోషిగా తేలారు. అందులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు పైడిన శిక్షను సస్పెండ్ చేసింది. అనంతరం, తన శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు