Sunday, May 5, 2024

బీర్ల ఐలయ్య సమక్షంలో గౌరాయపల్లి గ్రామం నుండిపెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరిన యువత..

తప్పక చదవండి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఈ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నిండా ముంచారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం యదగిరిగుట్ట మండలం, గౌరయిపల్లి గ్రామం నుండి సుమారు 200మంది యువకులు, అదే విధంగా రాజాపేట మండలం, పారుపల్లి గ్రామ సీనియర్ బిఆరెస్ పార్టీ నాయకుడు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఈ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే గా బీర్ల ఐలయ్యని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. దళిత సీఎంతో పాటు, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి కెసిఆర్ ఇప్పుడు గృహలక్ష్మీ పేరుతో మూడు లక్షలు ఇస్తామని ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నరాని బీర్ల ఐలయ్య అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏర్పాటు చేసుకున్న ఏ ఒక్క పని సహకారం కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు కట్టబెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో భానుచందర్, ఉపేందర్, కృష్ణమూర్తి, నరేష్, రఘు, నరసింగరావు, శ్రీకాంత్, శేఖర్, మల్లేష్, కరుణాకర్, నరేష్, కృష్ణారెడ్డి, శ్రవణ్ కుమార్, భరత్, వెంకటేష్, మధు సాయి, మధు, తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు