Saturday, May 4, 2024

ఘనంగా హునర్ మహోత్సవ్ ముగింపు వేడుకలు..

తప్పక చదవండి

హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా మైదానం లో ఇటీవల ఏర్పాటు చేసిన హునర్ మహోత్సవ్ కళా ఖండాల, వస్త్ర ప్రదర్శన మంగళ వారం ఘనంగా ముగిసాయి. దాదాపు 12 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు వినియోగ దారుల నుండి విశేష స్పందన లభించింది. దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వస్త్ర, కళాఖండాల కు సంబంధించిన వ్యాపారులు గృహోపకర వస్తువులతో పాటు, అవసరమైన వస్త్రాలు కళాఖండాలకు అపూర్వ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా వివిద నగరాల నుంచి వచ్చిన వస్త్ర కళాఖండ వ్యా పారులు అందుబాటులో ఉంచిన వాటికి మంచి డిమాండ్ వచ్చిందని నిర్వాహకులు దీపక్ శుక్లా తెలిపారు. ప్రదర్శనను మరికొన్ని రోజులు పాటు పొడిగించాలని వినియోగదారుల నుండి డిమాండ్ వస్తోందని, వారి డిమాండ్ మేరకు త్వరలో నే మరోసారి ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలు ఏర్పాటు చేసిన బండారాల సైతం అనూహ్య స్పందన వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం. దీపక్ శుక్ల- డైరెక్టర్, అసిస్టెంట్ మనేజర్స్ అర్. ఎహసన్ అస్గర్ అసితంట్, అర్.రాధ గౌర్, ఎల్. మెహంది హసన్, బి. మన్సూర్ అబ్బాస్ లు పాల్గొన్నారు.. హునార్ మహోత్సవం ముగింపు వేడుకలకు హాజరు అయ్యారు. అరుదైన కళాఖండాల ప్రదర్శన తో ప్రత్యేక ఆకర్షణగా హునార్ మహోత్సవ్, కళాత్మక వస్తువులు, వంటకాలు, సంగీతంతో జరుగుతున్న 12 రోజుల ఎక్స్‌పో కళాకారులు / చేతివృత్తుల వారి కోసం ఒక స్థిరమైన వేదికను అందించి ప్రోత్సహించడానికి, అరుదైన కళలను రక్షించడానికి సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో “హునార్ మహోత్సవ్” పేరిట కళాత్మక వస్తువులు, వంటకాల పండుగ జరిగింది. “హునార్ మహోత్సవ్” ఎగ్జిబిషన్ 13 అక్టోబర్ నుండి 24 అక్టోబర్ 2023 వరకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లో వున్న జింఖానా గ్రౌండ్‌లో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. “హునార్ మహోత్సవ్”లో 25 కంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి 300 కంటే ఎక్కువ మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొన్నారు..

- Advertisement -

అప్లిక్ వర్క్, డ్రై ఫ్లవర్స్, జూట్-కేన్, ఇత్తడి ఉత్పత్తులు, చెక్క మరియు మట్టి బొమ్మలు, అజ్రఖ్ బ్లాక్ ప్రింట్, బ్లూ ఆర్ట్ కుండలు, పష్మీనా షాల్, ఖాదీ ఉత్పత్తులు, బనారసి సిల్క్, వుడెన్ ఫర్నిచర్, చికన్ కారి ఎంబ్రాయిడరీ, చందేరీ సిల్క్ వంటి స్వదేశీ ఉత్పత్తులు, లక్క గాజులు , రాజస్థానీ ఆభరణాలు, ఫుల్కారీ, లెదర్ ఉత్పత్తులు, కుండలు, జనపనార ఉత్పత్తులు మొదలైనవి అమ్మకానికి ప్రదర్శనలో పెట్టారు. హునార్ మహోత్సవ్‌లోని “ఫుడ్ కోర్ట్” విభాగంలో సందర్శకులు దేశంలోని ప్రతి ప్రాంతం నుండి సాంప్రదాయ వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు మరియు లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ మరియు దాండియా నైట్‌లో పాల్గొనవచ్చు. ఈ ప్రదర్శనలో అందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు